Shivam Dube : ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన లీగ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న శివమ్ దూబే(Shivam Dube )శివమెత్తాడు. పూనకం వచ్చిన రీతిలో ఆడాడు.
ఏకంగా మరో ఆటగాడు రాబిన్ ఉతప్పతో కలిసి దంచి కొట్టాడు. కేవలం 45 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శివమ్ దూబే (Shivam Dube )5 ఫోర్లు 8 సిక్సర్లతో సత్తా చాటాడు. 95 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
దీంతో ఎట్టకేలకు సీఎస్కే తొలి విజయాన్ని నమోదు చేసింది ఐపీఎల్ 2022లో. ఇప్పటి వరకు 5 మ్యాచ్ లు ఆడిన సీఎస్కే 4 మ్యాచ్ లు ఓడి పోయింది. రాబిన్ వేణు ఉతప్పతో కలిసి 165 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు.
నవీ ముంబై లోని డీవై పాటిల్ స్టేడియం ఫోర్లు, సిక్సర్ల మోతతో దద్దరిల్లింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మూడో వికెట్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు ఈ ఇద్దరు ప్లేయర్లు. ఇక ఆకాశ్ దీప్ తను వేసిన నాలుగు ఓవర్లలో 58 పరుగులు ఇచ్చాడు.
శివమ్ దూబే ఈసారి సీఎస్కేకు వచ్చాడు. అంతకు ముందు 2021లో ఇదే జట్టుపై 57 రన్స్ చేశాడు. రాబిన్ ఉతప్ప 2017లో పూణేపై 87 రన్స్ చేశాడు.
అంతకు ముందు 2012లో పూణె వారియర్స్ పై కుమార సంగక్కర, కామెరాన్ వైట్ చేసిన 157 పరుగులే అత్యధికంగా ఉన్నాయి. ఇక రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్ లో ఐదు ఇన్నింగ్స్ లలో కేవలం 35 పరుగులు మాత్రమే చేశాడు.
మొత్తంగా ఆర్సీబీ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు శివమ్ దూబే.
Also Read : ఐపీఎల్ లో ఆడడం గొప్ప అనుభవం