Hamish Bennett : న్యూజిలాండ్ పేసర్ హమీస్ బెన్నెట్ సంచలన ప్రకటన చేశాడు. తాను క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అన్ని రకాల ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు.
కీవీస్ తరపున అన్ని ఫార్మాట్ లలో ఎన్నో మ్యాచ్ లు ఆడాడు . 489 వికెట్లు పడగొట్టాడు. 2011 ఐసీసీ వరల్డ్ కప్ కోసం ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంకలో జరిగిన బ్లాక్ క్యాప్ ల జట్టులో ఎంపికయ్యాడు బెన్నెట్.
తన 17 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో ఇదే చివరి సీజన్ అని డిక్లేర్ చేశాడు. 35 ఏళ్ల వయసు కలిగిన హమీస్ బెన్నెట్ న్యూజిలాండ్ అండర్ -19 జట్టు, సీనియర్ పురుషుల జట్టు, దేశీయ జట్లు వెల్లింగ్టన్ , కాంటర్ బరీకి ప్రాతినిధ్యం వహించాడు.
తాను చిన్నతనంలో నెట్స్ లో బౌలింగ్ చేస్తున్న సమయంలో తాను దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానని కలలో కూడా అనుకోలేదన్నాడు. ప్రారంభంలో తనను క్రికెట్ లో నిమగ్నం అయ్యేలా చేసిన ఓల్డ్ బాయ్స్ తామారు క్రికెట్ క్లబ్ ను మరిచి పోలేనన్నాడు.
అన్ని క్లబ్ లు తాను ఎదిగేందుకు దోహద పడ్డాయన్నాడు బెన్నెట్(Hamish Bennett ). ఈ సుదీర్ఘ ప్రయాణంలో తాను లక్ష్యాన్ని సాధించేందుకు సహకారం అందించాయని తెలిపాడు.
ఇదే జర్నీలో చాలా మంది గొప్ప ఆటగాళ్లు, కెప్టెన్లు, కోచ్ లతో కలిసి పని చేయడం, వారందరితో ఆడటం తన అదృష్టమని పేర్కొన్నాడు.
వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపాడు బెన్నెట్. అన్ని ఫార్మాట్ లు కలిపి 489 వికెట్లు తీయడం తనకు తీపి గుర్తుగా ఉండి పోతుందన్నాడు.
Also Read : ఉతికి ఆరేసిన రాబిన్ ఉతప్ప