Odean Smith : ఐపీఎల్ 2022 మెగా టోర్నీలో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఉత్కంఠ భరిత విజయం నమోదు చేసింది. మ్యాచ్ అంతా ఒక ఎత్తు పంజాబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓడియన్ స్మిత్ (Odean Smith)బౌలింగ్ ఒక ఎత్తు. మనోడు ఏకంగా 4 వికెట్లు తీశాడు.
ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించాడు. దీంతో 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 198 రన్స్ చేసింది.
ఇందులో శిఖర్ ధావన్ 70 రన్స్ చేస్తే కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 52 రన్స్ చేసి సత్తా చాటాడు. చివరి ఓవర్ దాకా టెన్షన్ క్రియేట్ చేసింది ఈ మ్యాచ్ . ప్రతి బంతికి ఉత్కంఠ రేపింది.
పంజాబ్ కింగ్స్ బౌలర్లు పూర్తిగా ముంబై ఇండియన్స్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో 186 పరుగులకే పరిమితమైంది. ఇద్దరు కీలక ప్లేయర్లను రనౌట్ చేయడం విశేషం.
ఆఖరు ఓవర్ ఓడియన్ స్మిత్ కు ఓవర్ వేసేందుకు ఛాన్స్ ఇవ్వడం కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ను అభినందించడం విశేషం. చివరి దాకా ముంబై చేతుల్లో ఉన్న మ్యాచ్ ను పంజాబ్ చేతుల్లోకి తీసుకు వచ్చాడు స్మిత్(Odean Smith).
ఇక 9 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయడం విశేషం ఈ ఓవర్ లో. ఆరు బంతులు 22 రన్స్ చేయాల్సి ఉండగా పూర్తిగా అద్భుతమైన బంతులతో కట్టడి చేశాడు.
దీంతో రన్స్ చేయలేక చేతులెత్తేశారు బ్యాటర్లు. ప్రస్తుతం ఎక్కడ చూసినా స్మిత్ నిజమైన హీరో అంటున్నారు క్రీడాభిమానులు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు.
Also Read : డెవాల్ట్ బ్రెవిస్ రైజింగ్ స్టార్