Joe Root : టెస్టు కెప్టెన్సీకి జో రూట్ గుడ్ బై

ఆసిస్ సీరీస్ ఓట‌మి ప్ర‌భావం

Joe Root : ఇంగ్లండ్ స్టార్ ప్లేయ‌ర్ , ఆ జ‌ట్టు టెస్టు కెప్టెన్సీ ప‌ద‌వికి తాను గుడ్ బై చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు జో రూట్(Joe Root). అనూహ్య నిర్ణ‌యాన్ని ఇవాళ ప్ర‌క‌టించాడు. ఆస్ట్రేలియా, వెస్టీండీస్ జ‌ట్ల‌తో ఇంగ్లండ్ పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసింది.

దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా తీవ్ర విమ‌ర్శలు ఎదుర్కొన్నాడు. ఇంటా బ‌య‌టా వ‌త్తిళ్లు త‌ట్టుకోలేక తాను త‌ప్పుకునేందుకు నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలిపాడు. ఆస్ట్రేలియా, విండీస్ ల‌పై ఇంగ్లండ్ టెస్టు సీరీస్ ఓడి పోయింది.

యాషెస్ లో ఇంగ్లాండ్ 0-4 తో ప‌రాజ‌యం పాలైంది. విండీస్ తో జ‌రిగిన మూడు టెస్టు సీరీస్ లో 0-1 తేడాతో ఓట‌మి మూట‌గ‌ట్టుకుంది. విచిత్రం ఏమిటంటే జో రూట్ నాయ‌కత్వ బాధ్య‌త‌లు తీసుకున్నాక ఆయ‌న సార‌ధ్యంలో ఇంగ్లండ్ 27 టెస్టులు గెలిపించాడు.

అత్యంత విజ‌య‌వంత‌మైన నాయ‌కుడిగా పేరొందాడు. కానీ ఆసిస్, విండీస్ సీరీస్ లు కొంప ముంచాయి. అంత‌కు ముందు ఇంగ్లండ్ జ‌ట్టుకు మైఖేల్ వాన్ , స‌ర్ అలెస్ట‌ర్ కుక్ , స‌ర్ ఆండ్రూ స్ట్రాస్ కంటే స‌క్సెస్ రేటులో ముందంజ‌లో ఉన్నాడు జో రూట్(Joe Root).

ఈ సంద‌ర్బంగా తాను కెప్టెన్సీ నుంచి ఎందుకు త‌ప్పుకోవాల్సి వ‌చ్చిందో తెలిపాడు . క‌రేబియ‌న్ టూర్ నుంచి వ‌చ్చాక ఆలోచించుకునేందుకు స‌మ‌యం దొరికింది. ఇదే క‌రెక్టు స‌మ‌యం అని నేను అనుకుంటున్నా.

టెస్టు కెప్టెన్ గా వైదొల‌గాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని తెలిపాడు. ఇది నా కెరీర్ లో నేను తీసుకోవాల్సిన అత్యంత స‌వాలుతో కూడుకున్న నిర్ణ‌య‌మ‌ని పేర్కొన్నాడు జో రూట్.

ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో చ‌ర్చించాకే త‌ప్పుకుంటున్నాన‌ని పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని వేల్స్ క్రికెట్ బోర్డు అధికారికంగా ధ్రువీక‌రించింది.

Also Read : శాంస‌న్ పాండ్యాను చూసి నేర్చుకో

Leave A Reply

Your Email Id will not be published!