Ravi Shastri : భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి సంచలన కామెంట్స్ చేశారు. ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 మెగా రిచ్ టోర్నీలో పాఫ్ డుప్లెసిస్ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ కు కచ్చితంగా చేరుతుందని పేర్కొన్నాడు.
అంతే కాదు ఐపీఎల్ టైటిల్ రేసులో తప్పక ఉంటుందని స్పష్టం చేశాడు. ప్రధానంగా డుప్లెసిస్ నాయకత్వం అద్బుతంగా ఉందని కితాబు ఇచ్చాడు.
జట్టులో విరాట్ కోహ్లి, మాక్స్ వెల్ తో పాటు ఇతర ఆటగాళ్లు సైతం రాణిస్తున్నారని ఆ జట్టుకే టైటిల్ గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నాడు. ఇప్పటి వరకు ఆర్సీబీ ఆడిన ఐదు మ్యాచ్ లలో మూడు మ్యాచ్ లలో విజయం సాధించింది.
రెండింట్లో ఓటమి పాలైంది. గతంలో జరిగిన ఐపీఎల్ లీగ్ వేరు కానీ ఇప్పుడు జరుగుతున్న రిచ్ లీగ్ వేరన్నాడు రవిశాస్త్రి(Ravi Shastri). ఈ సీజన్ లో మనం కొత్త ఛాంపియన్ ను చూడబోతున్నామని చెప్పాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఐపీఎల్ లో సత్తా చాటడం ఖాయమన్నాడు. వారు కచ్చితంగా ప్లే ఆఫ్స్ కు చేరుకోవడం మాత్రం ఖాయమన్నాడు. వారు మరింత దూకుడును ప్రదర్శిస్తున్నారు.
టోర్నీలో రోజు రోజుకు ఆడే మ్యాచ్ లలో రాటు దేలి పోతున్నారని పేర్కొన్నాడు మాజీ హెడ్ కోచ్. ప్రతి గేమ్ లో కొత్తగా తమ ప్రతిభను కనబరుస్తుండడం ఆ జట్టుకు బిగ్ అడ్వాంటేజ్ గా అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Also Read : హమ్మయ్య ‘ముద్దుగుమ్మ’ నవ్వింది