Manoj Tiwari : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ (Manoj Tiwari)సంచలన కామెంట్స్ చేశారు. భారత జట్టుకు రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ గా బాధ్యతలు చెపట్టే అవకాశాలు గుజరాత్ టైటాన్స్ స్కిప్పర్ గా ఉన్న హార్దిక్ పాండ్యాకే ఉందన్నాడు.
పరిమిత ఓవర్లకు అతడికి పగ్గాలు ఇస్తే బెటర్ అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం టీమిండియా వైస్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ కు కానీ , లేదా భవిష్యత్తు సారథిగా ఊహాగానాలు చేస్తున్న డీల్లీ క్యాపిటల్స్ స్కిప్పర్ రిషబ్ పంత్ కు ఛాన్స్ లేదని కుండ బద్దలు కొట్టాడు.
ప్రస్తుతం ఐపీఎల్ లో కెప్టెన్ గా రాణించడమే కాదు ఆటగాడిగా తనదైన మార్క్ కనబరుస్తున్నాడంటూ కితాబు ఇచ్చాడు మనోజ్ తివారీ(Manoj Tiwari).
రాజస్థాన్ రాయల్స్ జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెల రేగాడు హార్దిక్ పాండ్యా. అంతే కాదు టాప్ హిట్టర్ గా పేరొందిన సంజూ శాంసన్ ను అద్బుతమైన బంతితో రనౌట్ చేశాడు.
ఆపై జీషమ్ ను రిటర్న్ క్యాచ్ తో వెనక్కి పంపించాడు. ఓవరాల్ గా తనదైన సారథ్య ప్రతిభతో వన్ మ్యాన్ షోతో జట్టును విజయ పథంలోకి తీసుకు వెళ్లాడు.
ప్రస్తుతం ప్లే ఆఫ్స్ కు చేరే జట్లలో గుజరాత్ టైటాన్స్ కు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు మనోజ్ తివారీ. కాగా పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ టాప్ లో ఉంది.
Also Read : రైతుల పిల్లల కోసం హర్భజన్ వేతనం విరాళం