MI vs LSG : ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ 15వ సీజన్ అంతగా అచ్చి రానట్టుంది ముంబై ఇండియన్స్(MI vs LSG )కు. దుబాయి వేదికగా జరిగిన 14వ ఐపీఎల్ సీజన్ లో సైతం ముంబై పేలవమైన ప్రదర్శన చేపట్టింది.
రోహిత్ సేనకు ఘోరమైన పరాభవం దక్కింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.ఇక బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.
దీంతో ముంబై ఇండియన్స్ ముందు 200 టార్గెట్ ఉంచింది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ దుమ్ము రేపాడు. ఆకాశమే హద్దుగా చెల రేగాడు. అజేయ శతకంతో రఫ్ఫాడించాడు.
అనంతరం బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు మాత్రమే చేసి చేతులెత్తేసింది. ఇక ఈ జట్టులో 37 రన్స్ తేడాతో సూర్య కుమార్ యాదవ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఇక డెవాల్ట్ బ్రెవిస్ 31 రన్స్ చేస్తే తిలక్ వర్మ 26 , కీరన్ పొలార్డ్ 25 పరుగులు చేసి రాణించారు. ఆఖరి వరకు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. పొలార్డ్ మైదానంలో ఉన్నంత వరకు ముంబై ఇండియన్స్ (MI vs LSG )గెలుస్తుందని అనుకున్నారు.
కానీ లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు సత్తా చాటారు. ఆవేష్ ఖాన్ 3, చమీర , జాసన్ హోల్డర్ , రవి బిష్ణోయి, మార్కస్ స్టోయినిస్ చెరో వికెట్ తీశారు. ఇదిలా ఉండగా ముంబై ఇండియన్స్ కు ఈ ఐపీఎల్ లో వరుసగా ఇది ఆరో ఓటమి.
Also Read : భారత జట్టుకు పాండ్యా కాబోయే కెప్టెన్