Shoaib Akthar : పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ స్టార్ పేసర్ షోయబ్ అఖ్తర్(Shoaib Akthar) సంచలన కామెంట్స్ చేశాడు. భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ క్రికెట్ లో ఎంత గొప్ప ఆటగాడైనా ఒక్కోసారి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నాడు.
అయితే కోహ్లీ తనంతకు తాను సూపర్ హీరోనని అనుకుంటున్నాడని అందుకే సరిగా ఆటపై ఫోకస్ పెట్టలేక పోతున్నాడంటూ ఎద్దేవా చేశారు.
ముందు తనను తాను సాధారణ (ఆర్డినరీ) ప్లేయర్ గా భావించుకుంటే బెటర్ అని పేర్కొన్నాడు. తన సలహాను పాటిస్తే రన్స్ చేసేందుకు వీలు కలుగుతుందని తెలిపాడు.
ఐపీఎల్ 2022 రిచ్ 15వ లీగ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. రిషబ్ పంత్ ఒకే ఒక్క క్యాచ్ పట్టుకున్నాడంతే. ఇదే ఈ మ్యాచ్ లో కోహ్లీ చేసిన మంచి పని.
ఇటీవల ఎక్కువగా రన్స్ చేయలేక పోతున్నాడు కోహ్లీ. రెండు సార్లు మాత్రమే 40 పరుగులు చేయగలిగాడు. లేని పరుగు కోసం ప్రయత్నం చేసి తన వికెట్ ను సమర్పించుకున్నాడు కోహ్లీ.
దీనిని తప్పు పట్టాడు షోయబ్ అఖ్తర్. కోహ్లీ అయినా లేదా అతడి ప్లేస్ లో ఎంతటి టాప్ వన్ ప్లేయర్ అయినా సరే ఆడక పోతే ఆయా మేనేజ్ మెంట్లు తొలగించడం ఖాయమని హెచ్చరించారు. ఇ
ది తన లాంటి దిగ్గజ ఆటగాళ్లకు అనుభవ పూర్వకంగా తెలిసి వచ్చిందన్నాడు.
Also Read : ఢిల్లీని దెబ్బ కొట్టిన హేజిల్‌వుడ్