Dinesh Karthik : ఐపీఎల్ 2022 మెగా రిచ్ టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు స్టార్ హిట్టర్ దినేశ్ కార్తీక్. ఆ జట్టు విజయాలలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడు.
ఒకానొక దశలో రాజస్థాన్ రాయల్స్ జరిగిన లీగ్ మ్యాచ్ లో ఓడి పోయే దశలో ఉన్న ఆర్సీబీని గట్టెక్కించాడు. ఆ జట్టుకు ఊహించని రీతిలో విజయాన్ని చేకూర్చి పెట్టాడు.
ఆర్ఆర్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. తాజాగా లీగ్ మ్యాచ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఆర్సీబీ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన దినేశ్ కార్తీక్(Dinesh Karthik) కేవలం 34 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు.
66 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి. అజేయంగా నిలిచాడు. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా స్వంతం చేసుకున్నాడు.
ఈ సందర్బంగా మ్యాచ్ అనంతరం దినేశ్ కార్తీక్ ను తన సహచర ప్లేయర్ విరాట్ కోహ్లీ సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. పనిలో పనిగా కార్తీక్ ను ఆకాశానికి ఎత్తేశాడు.
అయితే ఏం కావాలని ఉందని అడిగిన ప్రశ్నకు చిత్రమైన సమాధానం ఇచ్చాడు దినేశ్ కార్తీక్. తనకు మళ్లీ భారత జట్టులోకి రావాలని ఉందన్నాడు.
అంతే కాదు ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే వరల్డ్ కప్ లో ఆడాలని ఉందని చెప్పాడు దినేశ్ కార్తీక్. అందు కోసమే తాను ఇంతలా కష్ట పడుతున్నానని తెలిపాడు.
జట్టులో ఆడాలని ఉంది. కానీ విపరీతమైన పోటీ ఉంటుందని తెలుసు. అందుకే ఇంతలా కసి మీద ఆడుతున్నానని పేర్కొన్నాడు.
Also Read : మళ్లీ మెరిసిన దినేశ్ కార్తీక్