David Miller : అబ్బా డేవిడ్ మిల్ల‌ర్ దెబ్బ

చెన్నై కింగ్స్ బిగ్ షాక్

David Miller  : ఫామ్ లోకి వ‌స్తే కొంద‌రి ఆట‌గాళ్ల‌ను త‌ట్టు కోవ‌డం క‌ష్టం. అందులో మొద‌ట‌గా చెప్పాల్సి వ‌స్తే ద‌క్షిణాఫ్రికా క్రికెట‌ర్ డేవిడ్ మిల్ల‌ర్(David Miller )గురించి ప్ర‌స్తావించాల్సిందే. డిఫెండింగ్ ఛాంపియ‌న్ పూర్తి ప‌ట్టు సాధించిన స‌మ‌యంలో ఈ స‌ఫారీ క్రికెట‌ర్ అడ్డు గోడ‌లా నిల‌బ‌డ్డాడు.

అంతే కాదు విధ్వంస‌క‌ర‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు. చివ‌రి దాకా ఉండి గుజ‌రాత్ టైటాన్స్ విజ‌యంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాడు. సీఎస్కేతో జ‌రిగిన మ్యాచ్ లో ర‌షీద్ ఖాన్ సెన్సేష‌న్ అయితే డేవిడ్ మిల్ల‌ర్(David Miller )మాత్రం ఫినిషర్ గా మారాడు.

అంతేనా కేవ‌లం 51 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న డేవిడ్ మిల్ల‌ర్ 51 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 8 ఫోర్లు 6 సిక్స‌ర్ల‌తో దంచి కొట్టాడు. 94 ప‌రుగులతో నాటౌట్ గా నిలిచాడు.

ఇక మిల్ల‌ర్ అస‌లు పేరు డేవిడ్ ఆండ్రూ మిల్లెర్. 10 జూన్ 1989లో పుట్టాడు. పూర్తి ప్రొఫెష‌న‌ల్ క్రికెట‌ర్. ఎడ‌మ చేతి వాటం బ్యాట‌ర్. అవ‌స‌ర‌మైన‌ప్పుడు వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు.

డాల్ఫిన్స్ కోసం దేశీయ క్రికెట్ ఆడ‌తాడు. ఐపీఎల్ లో ప్రాతినిధ్యం వ‌హించాడు. గతంలో పంజాబ్ కింగ్స్ , ఆర్ఆర్ త‌ర‌పున ఆడాడు. ప్ర‌స్తుతం గుజ‌రాత్ టైటాన్స్ లో చేరాడు.

2013లో ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ డేవిడ్ మిల్ల‌ర్ ను రూ. 6 కోట్ల‌కు తీసుకుంది. అదే ఏడాది అత్యంత వేగవంత‌మైన సెంచ‌రీ చేసి రికార్డు సృష్టించాడు.

ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్ లో కేవ‌లం 38 బంతులు ఆడి 101 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఐపీఎల్ లో తాను చూసిన అత్యుత్త‌మ ఇన్నింగ్స్ లో ఇది ఒక‌టి అని పేర్కొన్నాడు విరాట్ కోహ్లీ.

2016లో కెప్టెన్ గా ఉన్నాడు. ఆరు గేమ్ ల‌లో ఓట‌మి చెంద‌డంతో అత‌డు కెప్టెన్సీ పోగొట్టుకున్నాడు. 2020లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తీసుకుంది మిల్ల‌ర్ ను. 2022లో గుజ‌రాత్ చేజిక్కించుకుంది.

Also Read : డైన‌మెట్ ధోనీతో బంధం ప్ర‌త్యేకం

Leave A Reply

Your Email Id will not be published!