Rashid Khan : ఐపీఎల్ 2022లో జరిగిన లీగ్ మ్యాచ్ లో రషీద్ ఖాన్(Rashid Khan) దెబ్బకు చెన్నై సూపర్ కింగ్స్ విల విల లాడింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 170 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ ఒక దశలో ఓడి పోయే పరిస్థితికి చేరుకుంది.
బంతులు తక్కువ పరుగులు ఎక్కువ. ఈ సమయంలో 18వ ఓవర్ లో ఏకంగా 25 పరుగులు పిండుకున్నాడు
ఆఫ్గనిస్తాన్ కు చెందిన స్టార్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్. దీంతో మ్యాచ్ మొత్తం గుజరాత్ చేతుల్లోకి వెళ్లి పోయింది.
ఉన్న కొద్ది సేపే అయినా ప్రతి బంతిని బౌండరీ లైన్ కు దాటించే ప్రయత్నం చేశాడు రషీద్ ఖాన్(Rashid Khan).
కేవలం 21 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రషీద్ ఖాన్ 2 ఫోర్లు 3 సిక్సర్లతో విరుచుకు పడ్డాడు.
మొత్తం 40 పరుగులు చేశాడు. దీంతో మ్యాచ్ పూర్తిగా గుజరాత్ వశమైంది. దీంతో చెన్నైకి పరాజయం తప్పలేదు. మ్యాచ్ ఆఖరు బంతి వరకు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.
అందుకే టీ20కి అంత క్రేజ్. ఇక రషీద్ ఖాన్ విషయానికి వస్తే ఆఫ్గనిస్తాన్ లోని నంగర్ హార్ లో 1998లో పుట్టాడు. పది మంది తోబుట్టువులు ఉన్నారు.
ఆప్గన్ ను విడిచి పెట్టి కొన్నాళ్ల పాటు పాక్ లో తలదాచుకుంది రషీద్ కుటుంబం.
చిన్నప్పటి నుంచీ మనోడికి క్రికెట్ అంటే పిచ్చి. పాకిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ షహీద్ అఫ్రిదీ అంటే అభిమానం.
18 అక్టోబర్ 2015న జింబాబ్వేపై ఆఫ్గన్ తరపున వన్డే ఆడాడు. దీంతో పాటు టీ20 కూడా స్టార్ట్ చేశాడు.
ఆ దేశానికి కెప్టెన్ గా కూడా ఉన్నాడు. తర్వాత ఐపీఎల్ లో ఎంటర్ అయ్యాడు.
బెస్ట్ లెగ్ స్పిన్నర్ గా పేరు తెచ్చుకున్నాడు. 2018లో ఐసీసీ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది. వేలం పాటలో గుజరాత్ టైటాన్స్ దక్కించుకు ఖాన్ ను.
Also Read : కోహ్లీ..సాధారణ ప్లేయర్ గా ఆడు