Supreme Court : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూరి ఖేరి ఘటనలో కోలుకోలేని షాక్ తగిలింది. భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ (Supreme Court)నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం సంచలన తీర్పు వెలువరించింది.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా ఈ ఘటనలో కీలక నిందితుడిగా ఉన్నారు.
బాధిత కుటుంబాలు, రైతు సంఘాల నేతల ఫిర్యాదు మేరకు ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేశారు పోలీసులు.
అనంతరం ఇటీవల యూపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసింది అలహాబాద్ కోర్టు. దీనిని తీవ్రంగా తప్పు పట్టాయి విపక్షాలు.
బాధితులకు న్యాయం దక్కడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి , రైతు సంఘం అగ్ర నేత రాకేశ్ తికాయత్.
పార్లెమెంట్ లో సైతం విపక్షాలు సైతం తీవ్ర అభ్యంతరం తెలిపాయి.
ఈ తరుణంలో ఆశిష్ మిశ్రా కు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ రైతు బాధిత కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
వారి తరపున లాయర్ మహ్మద్ అమన్ వాదించారు. ఇరువురి వాదనలు విన్నది సీజేఐ ఎన్వీ రమణ (Supreme Court)నేతృత్వంలోని ధర్మాసనం. ఏప్రిల్ 4న ఈ కేసుకు సంబంధించి తీర్పు రిజర్వ్ లో ఉంచింది.
ఈనెల 18న సంచలన తీర్పు ప్రకటించింది. విచారణ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సుప్రీం ధర్మాసనం.
ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేయడాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్పు చెప్పింది.
వారం లోగా జైలుకు వెళ్లాలని ఆదేశించింది. ఇదే సమయంలో అలమాబాద్ హైకోర్టు బెయిల్ తీర్పును కొనసాగించలేమని స్పష్టం చేసింది.
విచారణ ఇంకా ప్రారంభం కానప్పుడు పోస్ట్ మార్టం నివేదిక, గాయాల స్వభావం వంటి అనవసరమైన వివరాలకు వెళ్ల కూడదని అభిప్రాయపడింది.
అత్యున్నత న్యాయస్థానం నియమించిన సిట్ సూచించిన విధంగా హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర సర్కార్ అప్పీలు
దాఖలు చేయక పోవడాన్ని కూడా న్యాయమూర్తులు సూర్యకాంత్ , హిమా కోహ్లీతో కూడిన ప్రత్యేక ధర్మాసనం తీవ్రంగా పరగణించింది.
రైతుల తరపున న్యాయవాది దుష్యంత్ దవే, ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించింది.
ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చి ఈ తీర్పు యోగి ప్రభుత్వానికి, మోదీ సర్కార్ కు ఓ చెంప పెట్టు లాంటిది అని చెప్పక తప్పదు.
Also Read : మితిమిరిన వేగం యువత పాలిట శాపం