Amway Fraud ED : రూ. 757.77 కోట్ల ఆమ్వే ఆస్తులు అటాచ్

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఈడీ

Amway Fraud ED : ప్ర‌త్య‌క్షంగా విక్ర‌యించే వినియోగ‌దారుల కంపెనీ ఆమ్ వే సంస్థ‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది భార‌త దేశానికి చెందిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ ).

రూ. 750 కోట్ల విలువైన ఆస్తుల‌ను మ‌నీలాండ‌రింగ్ నిరోధ‌క చ‌ట్టంకింద అటాచ్ చేసిన‌ట్లు ఈడీ సోమ‌వారం వెల్ల‌డించింది.  ఆమ్ వే ఇండియా మ‌ల్టీ లెవ‌ల్ మార్కెటింగ్ స్కామ్(Amway Fraud ED) న‌డుపుతోందంటూ ఆరోపించింది.

కొత్త‌గా స‌భ్యుల‌ను చేర్పించ‌డం. సీనియ‌ర్ల‌కు ఇందులో భారీగా క‌మీష‌న్ వ‌చ్చేలా చేయ‌డం చేస్తోందంటూ తెలిపింది ఈడీ. ఇదిలా ఉండ‌గా ఆమ్వే ఇండియా అటాచ్ చేసిన ఆస్తుల్లో త‌మిళ‌నాడులోని ఫ్యాక్ట‌రీ కూడా ఉంద‌ని వెల్ల‌డించింది.

ఆమ్ వే ఇండియా ఎంట‌ర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ తాత్కాలికంగా అటాచ్ చేసిన ఆస్తుల్లో దిండిగ‌ల్ జిల్లాల్లో భూమి, ఫ్యాక్ట‌రీ భ‌వ‌నం, ప్లాంట్, యంత్రాలు , వాహ‌నాలు, బ్యాంకు ఖాతాలు, ఫిక్స్ డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయ‌ని వెల్ల‌డించింది ఈడీ.

కాగా ఆస్తుల‌ను అటాచ్ చేయ‌డం అంటే అర్థం. ఆస్తులు, న‌గ‌దు లేదా ఖాతాల‌ను ఎవ‌రికీ విక్ర‌యించేందుకు వీలు ఉండ‌దు. లేదా త‌ర‌లించ‌డం కూడా సాధ్యం కాదు.

ఇక మ‌నీ లాండ‌రింగ్ నిరోధ‌క చ‌ట్టం కింద అటాచ్ చేసిన మొత్తం రూ. 757.77 కోట్ల ఆస్తుల‌లో స్థిరాస్థులు రూ. 411.83 కోట్లు కాగా మిగిలిన‌వి రూ. 345.94 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ లు ఉన్నాయ‌ని తెలిపింది.

ఇవ‌న్నీ ఆమ్ వేకి చెందిన 36 బ్యాంకు ఖాతాలు క‌లిగి ఉన్నాయ‌ని ప్ర‌క‌టించింది ఈడీ. స‌ద‌రు కంపెనీ బ‌హిరంగ మార్కెట్ లో విక్ర‌యించే వ‌స్తువుల ధ‌ర‌ల కంటే అత్య‌ధికంగా ఉన్నాయ‌ని ఆరోపించింది.

ఎంఎల్ఎం ముసుగులో ఆమ్వే పిర‌మిడ్ మోసాన్ని న‌డుపుతోందంటూ తెలిపింది.

Also Read : ఆదాయంలో టీసీఎస్ జోష్

Leave A Reply

Your Email Id will not be published!