KTR Umran Malik : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో ఒకే ఒక్కడి గురించే చర్చ ఎక్కువగా జరిగింది. ప్రధానంగా ఆటగాడు ఎవరో కాదు సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ బౌలర్ గా పేరొందిన ఒకే ఒక్కడు ఉమ్రాన్ మాలిక్.
150 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువగా బంతుల్ని విసురుతున్నాడు. అతడి బౌలింగ్ లో ఆడాలంటే బ్యాటర్లు సైతం జడుసుకుంటున్నారు. ప్రధానంగా ఈనెల 17న మ్యాచ్ లో మనోడు ఉగ్ర రూపం ప్రదర్శించాడు.
4 ఓవర్లు మాత్రమే వేశాడు. ఇందులో 28 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు ఉమ్రాన్ మాలిక్. ఇప్పుడు ప్రతి ఒక్కరితో పాటు తాజా, మాజీ క్రికెటర్లు సైతం మాలిక్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
అతడు మొదటగా జమ్మూ కాశ్మీర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ మెగా వేలంలో సన్ రైజర్స్ యాజమాన్యం తీసుకుంది. అతడికి మెంటర్ గా ఉన్న ఇర్ఫాన్ పఠాన్ సైతం విస్మయం వ్యక్తం చేశాడు.
ఉమ్రాన్ మాలిక్ పాకిస్తాన్ స్టార్ మాజీ పేసర్ వకార్ యూనిస్ ను గుర్తుకు తెస్తున్నాడని కితాబు ఇచ్చాడు. తాజాగా క్రికెట్ ను అభిమానించే తెలంగాణ ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్(KTR) సైతం మాలిక్ అద్భుతమైన ప్రతిభా పాటవాలను ప్రస్తావించాడు.
ఇదే విషయాన్ని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ ఆఖరి ఓవర్ లో ఒక్క కూడా ఇవ్వకుండా 3 వికెట్లు తీశాడు. ఇది అద్భుతమైన ఓవర్ గా పేర్కొన్నారు కేటీఆర్.
Also Read : మహిళా క్రికెట్ పై వినోద్ రాయ్ కామెంట్స్