Shashi Tharoor : ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక్క బౌలర్ గురించి చర్చ జరుగుతోంది. అతడు ఎవరో కాగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అరుదైన బౌలర్ ఉమ్రాన్ మాలిక్. మనోడిని 2021 ఐపీఎల్ వేలంలో హైదరాబాద్ మేనేజ్ మెంట్ తీసుకుంది.
ఈసారి బెంగళూరు వేదికగా జరిగిన మెగా ఐపీఎల్ వేలంలో సైతం రిటైన్ చేసుకుంది. మాలిక్ జమ్మూ కాశ్మీర్ కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో అత్యధిక వేగవంతమైన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.
150.18 కిలోమీటర్ల స్పీడ్ తో బంతుల్ని విసురుతుండడం ఇతడి ప్రత్యేకత. ఇక ఏ విషయమైనా సరే వెంటనే స్పందించే అలవాటు కలిగిన నాయకులలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఉమ్రాన్ మాలిక్ వేగాన్ని, బౌలింగ్ ను విస్తు పోయాడు. ఆయన ట్విట్టర్ వేదికగా తన స్పందనను తెలియ చేశాడు. ఇలాంటి బౌలర్ ఇండియాకు రావడం విశేషం. వాట్ ఏ బౌలర్ అంటూ కితాబు ఇచ్చాడు.
అంతే వెంటనే బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆలస్యం చేయకుండా జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. ఆస్ట్రేలియా లో త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ లో అతడిని ఆడించాలని కోరాడు శశి థరూర్.
విచిత్రం ఏమిటంటే పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్ లో ఎలాంటి పరుగు ఇవ్వకుండానే మూడు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు ఉమ్రాన్ మాలిక్. ఇదిలా ఉండగా శశి థరూర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
Also Read : ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ సూపర్