Yuzvendra Chahal : ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు అన్న దానికి కరెక్టుగా సూట్ అవుతుంది ఐపీఎల్ మెగా టోర్నీ. ఒకసారి బ్యాట్ ఆధిపత్యం చెలాయిస్తే ఇంకో సారి బంతి డామినేట్ చేస్తుంది.
చివరి దాకా ఎవరు గెలుస్తారో చెప్పలేని ఉత్కంఠ భరితమైన సన్నివేశానికి వేదికైంది ముంబై. రిచ్ లీగ్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి దాకా ఎవరు గెలుస్తారో చెప్పలేని రీతిలో సాగింది.
అనూహ్యంగా బంతితో ఎలా మ్యాచ్ ను టర్న్ చేయొచ్చో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ యుజ్వేంద్ర చహల్(Yuzvendra Chahal) చేసి చూపించాడు. ఇది కలయా నిజమా అన్న రీతిలో బంతిని గిరగిరా తిప్పేశాడు.
దీంతో ప్రత్యర్థి కోల్ కతా టీం తలవంచక తప్ప లేదు. యుజ్వేంద్ర చహల్ 4 ఓవర్లు వేసి ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ పూర్తిగా కేకేఆర్ చేతిలో నుంచి రాజస్థాన్ రాయల్స్ కు కట్టబెట్టాడు.
విజయాన్ని ఒంటి చేత్తో చేతికి అందించాడు. తను బంతిని తిప్పితే మ్యాజిక్ జరుగుతుందని నిరూపించాడు. ఇప్పుడు ఆ జట్టుకు అతడే బలం. బ్యాటింగ్ లో బట్లర్ చెలరేగితే బౌలింగ్ లో చహల్ సత్తా చాటాడు.
తనకు ఎదురే లేదని నిరూపించాడు మరోసారి. గతంలో కంటే ఈసారి ఐపీఎల్ లో మోస్ట్ వాంటెడ్ బౌలర్ గా ఉన్నాడు. ఏకంగా 17వ ఓవర్ లో హ్యాట్రిక్ సాధించాడు.
కోల్ కతా పతనాన్ని శాసించాడు చహల్. అందుకే యజ్వేంద్ర చహల్ చేసిన మ్యాజిక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఐపీఎల్ అభిమానులకు ప్రధానంగా రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ కు మరింత ఉత్సాహాన్ని తెప్పించింది.
Also Read : చెన్నైకి చుక్కలు చూపించిన రషీద్ ఖాన్