Aaron Finch Iyer : ఫించ్ మెరిసినా అయ్య‌ర్ ఆడినా ఓట‌మే

కోల్ క‌తా ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన చ‌హ‌ల్

Aaron Finch Iyer : ఆద్యంత‌మూ ముంబై వేదిక‌గా ప‌రుగుల వర‌ద పారింది. హ‌య్య‌స్ట్ ర‌న్స్ (Aaron Finch Iyer)ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ సాధించాయి. ఇరు జ‌ట్లు క‌లిపి సాధించిన ప‌రుగులు చూస్తే వామ్మో అనాల్సిందే. ఏకంగా 427 ప‌రుగులు వ‌చ్చాయి.

ఇందులో బ‌ట్ల‌ర్ సెంచ‌రీ సాధిస్తే. చ‌హ‌ల్ 5 వికెట్ల‌తో మెరిశాడు. క‌ళ్లు చెదిరే ర‌నౌట్ ఆక‌ట్టుకుంది. ఇక క్రికెట్ అభిమానుల‌కు గుర్తుండి పోయేలా చేసింది ఈ లీగ్ మ్యాచ్. ఆఖ‌రు ఓవ‌ర్ వ‌ర‌కు ఈ మ్యాచ్ ఉత్కంఠ భ‌రితంగా సాగింది.

7 ప‌రుగుల తేడాతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యం న‌మోదు చేసింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 217 ర‌న్స్ చేసింది. ఇక బ‌రిలోకి దిగిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ చివ‌రి దాకా పోరాడింది.

19.4 ఓవ‌ర్ల‌లో 210 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కోల్ క‌తా కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ 51 బంతులు ఆడి 85 ప‌రుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు 4 సిక్స‌ర్లు ఉన్నాయి. మ‌రో వైపు ఆరోన్ ఫించ్ 28 బంతులు ఆడి 58 ర‌న్స్ చేశాడు.

9 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. వీరిద్ద‌రూ క‌లిసి కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ను గెలుపు అంచుల దాకా తీసుకు వెళ్లారు. కానీ ఎప్పుడైతే య‌జ్వేంద్ర చ‌హ‌ల్ బంతిని తీసుకున్నాడో మ్యాజిక్ చేయ‌డం మొద‌లు పెట్టాడు.

ఏకంగా హ్యాట్రిక్ తీసుకోవ‌డంతో పాటు 5 వికెట్లు ప‌డ‌గొట్టి ప‌త‌నాన్ని శాసించాడు. మ‌రో వైపు వెస్టిండీస్ బౌల‌ర్ ఓడెమ్ మెకోమ్ 4 వికెట్లు తీసి స‌త్తా చాటాడు. చివ‌రి దాకా మ్యాచ్ కేకేఆర్ వైపు ఉండ‌గా చ‌హ‌ల్ తిప్పేశాడు.

Also Read : మాలిక్ స్పీడ్ కు శ‌శి థ‌రూర్ ఫిదా

Leave A Reply

Your Email Id will not be published!