Satya Easwaran : విప్రో కంట్రీ హెడ్ గా సత్య ఈశ్వర్ ను నియమించింది. ఐటీ సెక్టార్ లో టాప్ కంపెనీగా కొనసాగుతోంది విప్రో. ఐటీ మేజర్ విప్రో మంగళవారం సత్య ఈశ్వరన్ (Satya Easwaran) ను భారతదేశం ఇన్ చార్జ్ గా బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించింది.
వ్యూహాత్మాక సలహా, పరివర్తన, ఆధునీకరణ కార్యక్రమాల ద్వారా భారత దేశంలోని కీలక పరిశ్రమ రంగాలలో విప్రో వ్యాపారాన్ని బలోపేతం చేసే బాధ్యత సత్యకు అప్పగించింది.
క్లయింట్ లు క్లౌడ్ , డిజిటల్ , ఇంజనీరింగ్ ఆర్ అండ్ డి, డేటా అనలిటిక్స్ , సైబర్ సెక్యూరిటీలో విప్రో సామర్థ్యాలు , పెట్టబడులను వ్యాపార, డిజిటల్ పరివర్తన కార్యక్రమాలలో విజయం సాధించేందుకు క్లయింట్ కు సహాయం చేస్తారు.
వివిధ రంగాలలోని ప్రముఖ సంస్థల కోసం ఎండ్ టు ఎండ్ బిజినెస్ ట్రాన్స్ ఫర్మేషన్ ప్రోగ్రామ్ లను నడిపించే గ్లోబల్ వర్క్ అనుభవం సత్య ఈశ్వరన్ కు ఉంది. విప్రోలో చేరేందుకు ముందు,
సత్య కేపీఎంజీ ఇండియాలో బిజినెస్ కన్సల్టింగ్ హెడ్ , టెలికాం, మీడియా అండ్ టెక్నాలజీ సెక్టార్ లీడర్ గా ఉన్నారు. భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ లో ,యాక్సెంచర్ ఇండియాలో , సత్య సాఫ్ట్ వేర్ యాజ్ ఎ సర్వీస్ , క్లౌడ్ , డిజిటల్ , స్ట్రాటజీ , ట్రాన్స్ ఫర్మేషన్ పై ఫోకస్ పెట్టారు.
మేనేజ్ మెంట్ కన్సల్టింగ్ లో బహుళ నాయకత్వ స్థానాలను నిర్వహించారు. ఇదిలా ఉండగా విప్రోకు ఇండియా వ్యూహాత్మక మార్కెట్ కాగా సత్య చేరడాన్ని స్వాగతిస్తున్నట్లు విప్రో ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు అమిస్ సీహెచ్ పేర్కొన్నారు..
Also Read : భవిష్యత్తు భద్రం టీసీఎస్ కు లాభం