BCCI Women IPL 2023 : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ ఇప్పటి వరకు పురుషులకే పరిమితమై ఉండింది. కానీ ఐసీసీ(BCCI Women IPL 2023) తో పాటు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు – బీసీసీఐ వచ్చే ఏడాది విమెన్స్ తో ఐపీఎల్ నిర్వహించాలని డిసైడ్ అయింది.
దీనికి సంబంధించి బిడ్ కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
ఒక్క ఐపీఎల్ ద్వారా ప్రసారాల ద్వారానే ఐదేళ్లకు రూ. 50 వేల కోట్లకు పైగా రావచ్చని అంచనా. ఇది కేవలం పురుషుల ఐపీఎల్ కు మాత్రమే.
తాజాగా దేశ వ్యాప్తంగా ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కచ్చితంగా నిర్వహంచాలన్న నిర్ణయానికి వచ్చింది.
ఈ మేరకు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ క్లారిటీ కూడా ఇచ్చారు.
దీంతో విమెన్స్ ఐపీఎల్ కోసం జట్లను చేజిక్కించుకునేందుకు యాజమాన్యాలు కూడా రెడీ అయి పోయాయి.
ఇప్పటికే పంజాబ్ కింగ్స్ పురుషుల జట్టు సహ యజమాని తాము విమెన్స్ ఐపీఎల్ కు సంబంధించి ఒక జట్టును తీసుకునేందుకు రెడీగా ఉన్నామని ప్రకటించాడు.
దీంతో ఈ విమెన్స్ ఐపీఎల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో కూడా కోట్లు కురిసే ఛాన్స్ ఉంది. మొదటగా ఐపీఎల్ లో ఆరు జట్లు ఉండేలా ప్లాన్ చేస్తోంది.
ఇప్పటి వరకు మెన్స్ ఐపీఎల్ లో 14వ సీజన్ ముగిసింది. మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి.
తాజాగా ముంబై వేదికగా జరుగుతున్న 15వ సీజన్ లో 10 జట్లు పాల్గొంటున్నాయి. గుజరాత్, లక్నో చేరాయి.
ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేరుతో స్టార్ట్ చేసేందుకు ప్రయత్నాలలో మునిగి పోయింది బీసీసీఐ. మహిళల ఐపీఎల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆరు జట్లను చేజిక్కించుకునేందుకు ఆయా జట్ల ఫ్రాంచైజీలు పోటీలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఐపీఎల్ స్టార్ట్ అవుతుందని తెలిసి సంతోషానికి గురవుతున్నట్లు పేర్కొన్నారు భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా(BCCI Women IPL 2023).
ఈ ఐపీఎల్ ద్వారా మహిళా క్రికెట్ కు ఆదరణ పెరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. వారితో ఆరు జట్లను ఏర్పాటు చేయడం పెద్ద విషయమేమీ కాదని అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా ఉమెన్స్ ఐపీఎల్ కు సంబంధించి విధి విధానాలను తయారు చేయలేదు. మహిళా ఐపీఎల్ కు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది.
ఇదే గనుక జరిగితే ఒక రకంగా బూస్ట్ అని చెప్పక తప్పదు. మొత్తంగా మహిళా ఐపీఎల్ కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.
Also Read : పీకే రక్షించేనా కాంగ్రెస్ గట్టెక్కేనా