LSG vs RCB IPL 2022 : డుప్లెసిస్ షాన్ దార్ ఇన్నింగ్స్

ల‌క్నో టార్గెట్ 182 ర‌న్స్

LSG vs RCB : ఐపీఎల్ 2022 రిచ్ లో భాగంగా జ‌రుగుతున్న లీగ్ మ్యాచ్ లో టైటిల్ ఫెవ‌రేట్ గా ఉన్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(LSG vs RCB) నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 181 ప‌రుగులు చేసింది. కోహ్లీ నిరాశ ప‌రిచినా కెప్టెన్ పాఫ్ డుప్లెసిస్ అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు.

సార‌థిగా త‌న బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించాడు. ఓ వైపు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న త‌న జ‌ట్టుకు గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోర్ అందించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ల‌క్నో సూప‌ర్ జెయింట్స్(LSG vs RCB) కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అనంత‌రం బ‌రిలోకి దిగిన ఆర్సీబీ జ‌ట్టులో కెప్టెన్ డుప్లెసిస్ టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు.

96 ప‌రుగులు చేశాడు. కేవ‌లం 4 ప‌రుగుల దూరంలో సెంచ‌రీ మిస్స‌య్యాడు. గ్లెన్ మ్యాక్స్ వెల్ 23 ప‌రుగులు చేస్తే షాబాజ్ అహ్మ‌ద్ 26 ర‌న్స్ తో రాణించారు. చివ‌ర‌లో వ‌చ్చిన దినేష్ కార్తీక్ 8 బంతులు ఆడి 13 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

ఇక ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ బౌల‌ర్ల‌లో దుశ్యంత చ‌మీర‌, జాస‌న్ హోల్డ‌ర్ చెరో రెండు వికెట్లు తీస్తే కృనాల్ పాండ్యా ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉండ‌గా కెప్టెన్ డుప్లెసిస్ పొర‌పాటు కార‌ణంగా షాబాద్ ర‌నౌట్ గా వెనుదిరిగాడు.

ఇక ప్ర‌భు దేశాయ్ కేవ‌లం 10 ప‌రుగులే చేశాడు. 50 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ఉన్న ఆర్సీబీ జ‌ట్టును కెప్టెన్ గ‌ట్టెక్కించాడు.

ఇరు జ‌ట్లు 8 పాయింట్ల‌తో చెరీ స‌మానంగా ఉన్నాయి. ర‌న్ రేట్ కార‌ణంగా ఆర్సీబీ ల‌క్నో కంటే ముందంజ‌లో ఉంది.

Also Read : కీల‌క పోరులో గెలుపు ఎవ‌రిదో

Leave A Reply

Your Email Id will not be published!