Faf du Plessis : సెంచ‌రీ మిస్సైనా సెన్సేష‌న్

4 ప‌రుగుల తేడాతో సెంచ‌రీ మిస్

Faf du Plessis : ఈసారి ఐపీఎల్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు గాడిన ప‌డింది. గ‌త ఐపీఎల్ లో పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకున్న ఆ జ‌ట్టు విజ‌యాల బాట ప‌ట్టింది.

ఇప్ప‌టి వ‌ర‌కు రిచ్ లీగ్ లో 6 మ్యాచ్ లు ఆడి ఒక మ్యాచ్ మాత్ర‌మే ఓట‌మి పాలైంది. విరాట్ కోహ్లీ సుదీర్ఘ కాలం పాటు ఆర్సీబీకి కెప్టెన్ గా ఉన్నాడు.

అన్ని ఫార్మాట్ ల కు సంబంధించిన కెప్టెన్సీ ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. దీంతో ఆర్సీబీ మేనేజ్ మెంట్ కోహ్లీ ప్లేస్ లో ద‌క్షిణాఫ్రికా స్టార్ హిట్ట‌ర్ గా పేరొందిన ఫ్రాంకోయిస్ ఫాఫ్ డు ప్లెసిస్(Faf du Plessis) కు ప‌గ్గాలు అప్ప‌గించింది.

ఇపుడు ఆ జ‌ట్టు టైటిల్ ఫెవ‌రేట్ లో ఉంది. ఇందుకు ప్ర‌త్యేకంగా చెప్పు కోవాల్సింది కెప్టెన్ గా ఉన్న డుప్లెసిస్(Faf du Plessis) గురించే. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో 50 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న స‌మ‌యంలో గోడ‌లా నిల‌బ‌డ్డాడు డుప్లెసిస్.

ఏకంగా 96 ప‌రుగులు చేసి విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. త‌న జ‌ట్టు స్కోర్ పెరిగేలా చేశాడు. 96 ప‌రుగులు చేశాడు. కేవ‌లం 4 ప‌రుగుల దూరంలో సెంచ‌రీ చేయ‌కుండా దుర‌దృష్టం అత‌డిని వెంటాడింది.

అయితేనేం జ‌ట్టును విజ‌య ప‌థ‌కంలో తీసుకు వెళ్ల‌డంలో స‌క్సెస్ అయ్యాడు. ఇక డుప్లెసిస్ 13 జూలై 1984లో పుట్టాడు. ద‌క్షిణాఫ్రికా క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్. ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ ఫీల్డ‌ర్ల‌లో ఒక‌డిగా పేరొందాడు.

2019లో క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ గా ఎంపిక‌య్యాడు. కుడి చేతి బ్యాట‌ర్. ఎడ‌మ చేతి లెగ్ స్పిన్న‌ర్. ఆస్ట్రేలియాలో ఆసిస్ ను ఓడించిన ఏకైక స‌ఫారీ కెప్టెన్ గా గుర్తింపు పొందాడు.

Also Read : డుప్లెసిస్ షాన్ దార్ ఇన్నింగ్స్

Leave A Reply

Your Email Id will not be published!