Marco Jansen : ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ దుమ్ము రేపుతోంది. ప్రధానంగా బౌలర్లు ఒకరి తర్వాత మరొకరు రాణిస్తున్నారు. తమ సత్తా చాటుతున్నారు. మిస్సైల్ లాంటి బంతులతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు.
బంతులు ఎలా వస్తున్నాయో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఓ వైపు నట్టూ చెలరేగి పోతే, ఇన్ స్వింగర్లతో ఇబ్బంది పెడితే మరో వైపు మార్కో జాన్సెన్ (Marco Jansen)చెలరేగి పోయాడు.
ఏకంగా ఒకే ఓవర్ లో ముగ్గురిని పెవిలియన్ కు పంపించాడు. వారెవరో కాదు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , వరల్డ్ లో టాప్ బ్యాటర్లలో ఒకడైన విరాట్ కోహ్లీ, ఇంకొకరు పాఫ్ డుప్లెసిస్ మోస్ట్ వాంటెడ్, డేంజరస్ ప్లేయర్ గా పేరొందాడు.
వీరిద్దరికి చుక్కలు చూపించాడు మార్కో జాన్సెన్(Marco Jansen). ప్రస్తుతం అతడు వేసిన బంతుల్ని ఎదుర్కోలేక చతికిలపడిన వైనంపై తాజా, మాజీ క్రికెటర్లు విస్తు పోయారు.
సోషల్ మీడియా వేదికగా తమ స్పందనను తెలియ చేస్తున్నారు. ఇది ఊహించని పరిణామం. ఈసారి ఐపీఎల్ అత్యంత రసవత్తరంగా మారుతోంది. ఎవరు ప్లే ఆఫ్స్ కు వెళతారనేది చెప్పడం కష్టంగా ఉంది.
ప్రస్తుతం ఒకే ఓవర్ లో మూడు వికెట్లు తీయడం అన్నది మామూలు విషయం కాదంటున్నారు. భువనేశ్వర్ ఫస్ట్ ఓవర్ ముగియగానే రెండో ఓవర్ మార్కో జాన్సెన్ తీసుకున్నాడు.
వచ్చీ రావడంతోనే బెంగళూరు టాప్ ఆర్డర్ ను కూల్చాడు. దీంతో బెంగళూరు 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. క్రికెట్ లో ఈ రకంగా కూడా బౌలింగ్ చేస్తారా అని ఆశ్చర్య పోయేలా చేశాడు మార్కో అంటూ కితాబు ఇస్తున్నారు.
Also Read : పంత్ తీరుపై అజహరుద్దీన్ ఫైర్