SRH : నిన్నటి దాకా సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఆశలు లేవు. అంచనాలు అంతకన్నా లేవు. దుబాయ్ వేదికగా జరిగిన 2021 లో ఐపీఎల్ లో ఆజట్టు ప్లేస్ ఆఖరు. కానీ సీన్ మారింది. సిట్యూయేషన్ మారింది.
దిగ్గజ జట్లకు కోలుకోలేని షాక్ లు ఇస్తూ దూసుకు పోతోంది సన్ రైజర్స్ హైదరాబాద్(SRH ). ఐపీఎల్ చరిత్రలో అత్యంత తక్కువ రెండో స్కోర్ ను చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కేవలం 68 పరుగులకే చాప చుట్టేసింది.
మార్కో జాన్సెన్ 4 ఓవర్లు వేసి 25 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇక తమిళనాడు రైజింగ్ స్టార్ టి. నటరాజన్ 4 ఓవర్లు రన్స్ ఇచ్చి 10 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
ఆర్సీబీపై ఎస్ ఆర్ హెచ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ లో ఇది వరుసగా ఐదో విజయం ఇది. ఇంకా 72 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.
దీంతో పాయింట్ల పట్టికలో రెండో ప్లేస్ కు చేరుకుంది. దీంతో అరుదైన రికార్డును నమోదు చేసింది. బాల్స్ ఎక్కువగా మిగిలిన సందర్భాల్లో గెలుపొందిన నాలుగో టీమ్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH )నిలిచింది.
ఇక తొలి స్థానంలో ముంబై ఇండియన్స్ 2008లో కేకేఆర్ పై 87 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. కొచ్చి టస్కర్ 76 బంతులు మిగిలి ఉండగానే 2011లో రాజస్థాన్ రాయల్స్ పై , పంజాబ్ కింగ్స్ 73 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించింది.
72 బంతులు మిగిలి ఉండగానే ప్రస్తుతం ఆర్సీబీపై గెలుపొందింది. ఇదిలా ఉండగా 2018లో 71 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ కింగ్స్ పై ఆర్సబీ విజయం సాధించింది.
Also Read : మార్కో మామూలోడు కాదప్పా