Boria : దేశ వ్యాప్తంగా సంచనలం రేపింది భారత క్రికెటర్ వృద్ధి మాన్ సాహా వ్యవహారం. తనను స్పోర్ట్స్ జర్నలిస్ట్ బొరియా మజుందార్( Boria) బెదిరించాడంటూ ఆరోపించారు. అది తీవ్ర చర్చకు దారి తీసింది.
ఈ తరుణంలో బొరియా కూడా సాహాపై సంచలన ఆరోపణలు చేస్తూనే కోర్టులో కేసు ఫైల్ చేశాడు. తాను చేసిన వాట్సాప్ చాట్ ను మార్ఫింగ్ చేశాడంటూ మండిపడ్డాడు.
దీంతో రంగంలోకి దిగిన బీసీసీఐ ఈ మొత్తం వ్యవహారంపై ఓ కమిటీని ఏర్పాటు చేసింది. త్వరగా నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. విచారణ కమిటీ పూర్వపరాలు పరిశీలించింది.
ఈ మేరకు కమిటీ సమ్పించిన రిపోర్ట్ ను బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమీక్షించింది. వృద్ది మాన్ సాహా వ్యవహారంలో జర్నలిస్ట్ బొరియా మజుందార్ దే తప్పని తేలింది.
దీంతో ఆయన రెండు సంవత్సరాల పాటు నిషేధం విధించే అవకాశం ఉంది. ఈ కాలంలో బొరియా మజుందార్( Boria) భారత క్రికెట్ జట్టు సభ్యులను కలవ కూడదు.
అంతే కాదు స్వదేశంలో భారత్ ఆడే మ్యాచ్ లకు వెళ్ల కూడదని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
అయితే సామా చేసిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ ధుమాల్ , అపెక్స్ కౌన్సిల్ మెంబర్ ప్రభు తేజ్ బాటియాలతో బీసీసీఐ కమిటీని నియమించింది. కమిటీ ముందు సాహా, బొరియా హాజరయ్యారు.
Also Read : ఐపీఎల్ ఫైనల్ అహ్మదాబాద్ లో