Modi : భారత దేశం గర్వించ దగిన మహా గాయని లతా మంగేష్కర్. ఈ ఏడాది ఫిబ్రవరి 6న 92 ఏళ్ల వయసు కలిగిన గాన కోకిల లతా మంగేష్కర్ కాలం చేశారు. లతా మంగేష్కర్ లెక్కనేనన్ని పాటలు పాడారు.
అంతా ఆమెను దీదీ అని పిలుచుకుంటారు. భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీకి లతా మంగేష్కర్ అంటే ఎనలేని అభిమానం. ఆమె అన్నా , ఆమె పాటలన్నా చచ్చేంత ఇష్టం. లతా మరణం తట్టుకోలేక మోదీ కన్నీటి పర్యంతం అయ్యారు.
ఆమె అంత్యక్రియలకు తన ప్రోటోకాల్ ను పక్కన పెట్టి హాజరయ్యారు. ఆమెకు కన్నీటి నివాళి అర్పించారు. ఈ దేశం గర్వించ దగిన మహోన్నత వ్యక్తులలో లతా మంగేష్కర్ ఒకరు అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా లతా మంగేష్కర్ జ్ఞాపకారథం లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డును ఏర్పాటు చేశారు. దేశానికి , సమాజానికి నిస్వార్థ సేవ చేసినందుకు గాను దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అవార్డు కు ఎంపిక చేసినట్లు ప్రకటించింది.
మొట్ట మొదటి పురస్కారం అందుకున్న వ్యక్తిగా చరిత్రలో నిలిచి పోయారు ప్రధాని. ఆదివారం ముంబైలో జరిగిన 80వ వార్షిక మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డుల ప్రధానోత్సవంలో ్రధాని మోదీ(Modi )పాల్గొన్నారు.
తొలి అవార్డును ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా మరోసారి కంటతడి పెట్టారు. ఈ అవార్డును దేశ ప్రజలందరికీ అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు మోదీ.
సంగీతం మాతృత్వం, ప్రేమ అనుభూతి ఇస్తుంది. దేశభక్తిని పెంపొందంచేలా చేస్తుందన్నారు.
Also Read : కియారా , సిద్ధార్థ్ మల్హోత్రా విడిపోయారా?