Mumbai Indians : ఐపీఎల్ 2022లో అత్యంత చెత్త ప్రదర్శనతో తీవ్ర నిరాశకు గురి చేసింది రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్(Mumbai Indians) . ఆ జట్టు గతంలో గణనీయమైన విజయాలు నమోదు చేసింది.
అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది. పలు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న జట్టేనా ఇది అన్న అనుమానం ఫ్యాన్స్ లోనే కాదు తాజా, మాజీ ఆటగాళ్లలో నెలకొంది.
ఇప్పటి వరకు ఆ జట్టు ఎనిమిది మ్యాచ్ లు ఆడింది. కానీ ఏ ఒక్క మ్యాచ్ గెలువలేక పోయింది. ఒక రకంగా అన్ని విభాగాలలో ముంబై పూర్తిగా పేలవమైన ఆట తీరుతో నిరాశ పరుస్తోంది.
ఇదే రకమైన ఆట తీరు కనబరుస్తూ పోతే గనుక అత్యధిక అపజయాలు మూట గట్టుకున్న జట్టుగా ఐపీఎల్ లో చరిత్ర సృష్టిస్తుంది. లక్నో సూపర్ జెయింట్స్ జరిగిన మ్యాచ్ లో మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై లక్నోను పూర్తిగా కట్టడి చేసింది.
ఒక రకంగా చెప్పాలంటే ఐపీఎల్ లో 168 రన్స్ అన్నది పెద్ద స్కోర్ కానే కాదు. కానీ అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఏ ఒక్కరు ఆ జట్టును గెలిపిద్దామన్న ఆలోచన లేకుండా పోయింది.
ఈ విషయంలో ప్రధాన కోచ్ గా ఉన్న శ్రీలంక క్రికెట్ దిగ్గజం మహేళ జయవర్దనే ఆలోచించాల్సి ఉంటుంది. ముంబై ఓడి పోతే ఓకే కానీ దానిని నడిపిస్తున్న సంస్థ దిగ్గజ వ్యాపారవేత్త రిలయన్స్ చీఫ్ అంబానీ. ఆయన భార్య నీతా అంబానీ, కొడుకు, కూతురు. వాళ్ల చేతుల్లోనే ఈ జట్టు కొనసాగుతోంది.
దేనినైనా భరిస్తారు కానీ వాళ్లు ఓటమిని ఒప్పుకోరు. మరి ఈ వరుస పరాజయాలకు రోహిత్ శర్మ బాధ్యత వహిస్తాడా. లేక తానే స్వచ్ఛందంగా తప్పుకుంటాడా వేచి చూడాలి.
Also Read : రోహిత్ శర్మపై మైఖేల్ వాన్ కామెంట్స్