PBKS vs CSK : ఐపీఎల్ 2022లో డిఫెండింగ్ ఛాంపియన్ మరోసారి బోల్తా పడింది. లీగ్ మ్యాచ్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ (PBKS vs CSK)తో జరిగిన కీలక మ్యాచ్ లో చివరి దాకా పోరాడింది. 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
దీంతో చెన్నై సూపర్ కింగ్స్ కు ఇది వరుసగా ఆరో ఓటమి. ఆంధ్రా క్రికెటర్ అంబటి రాయుడు ఒంటరి పోరు కొనసాగించినా జట్టును గట్టెక్కించ లేక పోయాడు. తన జట్టును గెలుపునకు దగ్గరగా చేర్చాడు.
కానీ ఆఖరులో వెనుదిరగడంతో ఉన్నట్టుండి పరాజయం తప్పలేదు. అంతకు ముందు చెన్నై కింగ్స్ కెప్టెన్ రవీంద్ర జడేజా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి పంజాబ్ కు వచ్చిన శిఖర్ ధావన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 59 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 2 సిక్సర్లతో 88 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. విజయంలో కీలక పాత్ర పోషించిన ధావన్ కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
అనంతరం 188 పరుగుల టార్గెట్ తో మైదానంలోకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేసింది. అంబటి రాయుడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
39 బంతులు ఎదుర్కొని 78 రన్స్ చేశాడు. ఇందులో 7 ఫోర్లు 6 సిక్స్ లు ఉన్నాయి. అర్ష్ దీప్ చెన్నై పతనాన్ని శాసించాడు. ఆఖరున వేసిన 2 ఓవర్లలో కేవలం 14 రన్స్ మాత్రమే ఇచ్చాడు.
కెప్టెన్ జడేజా క్రీజులో ఉన్నా కేవలం 21 రన్స్ చేశాడు. ఈసారి ధోనీ మ్యాజిక్ వర్కవటు్ కాలేదు. 12 పరుగులు మాత్రమే చేయడంతో ఓటమి తప్పలేదు.
Also Read : అనవసర షాట్స్ ఆడాం ఓడిపోయాం