Shikhar Dhawan : భారత క్రికెట్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన 36 ఏళ్ల వయసు కలిగిన ఢిల్లీకి చెందిన శిఖర్ ధావన్ (Shikhar Dhawan) అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో టీమిండియా వెటరన్ ఓపెనర్ , పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్ 2022లో భాగంగా ముంబై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా ఆడాడు. 9 వేల పరుగుల మైలు రాయిని దాటాడు. దాంతో టీ20 ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఇండియన్ బ్యాటర్ గా రికార్డు క్రియేట్ చేశాడు.
ఇప్పటి వరకు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు కోహ్లీ 10 వేల 392 రన్స్ చేశాడు.
ఇక రెండో స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ , భారత క్రికెట్ జట్టు కు సారథ్యం వహిస్తున్న రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు హిట్ మ్యాన్ 10 వేల 48 పరుగులు చేశాడు.
భారత జట్టుకు ధావన్ (Shikhar Dhawan) ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో, వన్డేలో తనదైన పాత్ర పోషించాడు. బ్యాటర్ గా పేరొందాడు. 2013 ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించాడు.
ఇదే సమయంలో ఆ జట్టుకు కెప్టెన్ గా కూడా ఉన్నాడు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. ఇక ఈసారి మెగా వేలంలో భాగంగా ఫిబ్రవరి 12, 13 లలో బెంగళూరు వేదికగా జరిగిన ఆక్షన్ లో పంజాబ్ కింగ్స్ రూ. 8.25 కోట్లకు శిఖర్ ధావన్ ను కొనుగోలు చేసింది.
Also Read : అంబటి రాయుడు అదుర్స్