Ravi Shastri : భారత క్రికెట్ జట్టుకు సుదీర్ఘ కాలం పాటు హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్ రవిశాస్త్రి(Ravi Shastri )సంచలన కామెంట్స్ చేశారు. ప్రపంచంలో ఇతర దేశాల కంటే ఇండియాలోనే అసూయ పరులు ఎక్కువగా ఉన్నారని ఆరోపించాడు.
అంతే కాదు తాను విఫలం చెందాలని ఆ అసూయపడే వ్యక్తులతో కూడిన గ్యాంగ్ చివరి దాకా ప్రయత్నం చేసిందని పేర్కొన్నాడు. ఆయన ఓ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక అంశాలపై పంచుకున్నారు.
కానీ నేను ముందు నుంచీ సమస్యలను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం కలిగి ఉన్నానని అందుకే సక్సెస్ అయ్యానని చెప్పారు. 2014 నుంచి 2021 దాకా భారత జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్నా. భారత క్రికెట్ జట్టును అన్ని ఫార్మాట్ లలో వరల్డ్ లో టాప్ లో నిలిపానని చెప్పాడు రవిశాస్త్రి(Ravi Shastri ).
ఇంతకంటే ఇంకేం కావాలని అన్నాడు. చివరి వరకు బీసీసీఐ తనను కొనసాగించాలని అనుకుందన్నాడు. తనంతకు తాను తప్పు కోలేదన్నాడు.
అయితే తానే కొంత విశ్రాంతి అవసరమని భావించి నిష్క్రమించానని తెలిపాడు రవిశాస్త్రి. తాను విఫలం చెందాలని కోరుకునే ముఠా (గ్యాంగ్ ) ఒకటి ఉందంటూ సంచలన ఆరోపణలు చేశాడు.
తనకు కోచింగ్ బ్యాడ్జీలంటూ లేవన్నాడు. ఆస్ట్రేలియాను ఆ దేశంలో ఓడించ గలిగామని పేర్కొన్నాడు. జట్టును మరింత బలమైన జట్టుగా తీర్చిదిద్దా. మరింత దూకుడు పెంచేలా చేశానని తెలిపాడు రవిశాస్త్రి.
పనిలో పనిగా ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో కీలకమైన ఆటగాళ్లు ఉన్నారని, ప్రత్యేకించి జో రూట్ అద్భుతమైన ఆటగాడంటూ కొనియాడారు.
Also Read : రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు బిగ్ ఫైట్