Ravi Shastri Kohli : కోహ్లీ ఐపీఎల్ ను వ‌దిలేయ్ రెస్ట్ తీసుకో

మాజీ హెడ్ కోచ్ ర‌విశాస్త్రి సల‌హా

Ravi Shastri  : వ‌రుస‌గా వైఫ‌ల్యం చెందుతూ వ‌స్తున్న భార‌త స్టార్ క్రికెట్ ప్లేయ‌ర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పై సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ హెడ్ కోచ్ ర‌విశాస్త్రి(Ravi Shastri ). భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ గా సుదీర్ఘ కాలం పాటు ఉన్నాడు కోహ్లీ.

ర‌విశాస్త్రి, కోహ్లీ మ‌ధ్య గాఢ‌మైన అనుబంధం ఉంది. రెండు సార్లు డ‌కౌట్ అయ్యాడు కోహ్లీ. తాజాగా ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో నిరాశ ప‌రిచాడు. ఓపెన‌ర్ గా వ‌చ్చినా త‌న ఫామ్ లో ఎలాంటి మార్పు రాలేదు.

దీంతో ర‌విశాస్త్రి కొంత కాలం పాటు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని, అందుకే ఐపీఎల్ ను వ‌దిలి వేస్తే బెట‌ర్ అని సూచించాడు. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ప్ర‌స్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్న‌ట్టు అనిపిస్తోంద‌ని, అందుకే కాస్తా రెస్ట్ తీసుకుంటే మ‌ళ్లీ ఆట‌లో గాడిన ప‌డ‌వ‌చ్చ‌ని సూచించారు మాజీ హెడ్ కోచ్. కుటుంబంతో గ‌డిపితే కొంత మార్పు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నాడు.

ఇదిలా ఉండ‌గా ఐపీఎల్ 2022లో విరాట్ కోహ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు 9 మ్యాచ్ లు ఆడాడు. మొత్తం 128 ప‌రుగులు చేశాడు. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ , స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో జ‌ర‌గిన గేమ్ ల‌లో గోల్డెన్ డ‌క్ గా అవుట‌య్యాడు.

రాజస్థాన్ తో జ‌రిగిన మ్యాచ్ లో కేవ‌లం 9 ప‌రుగులు మాత్ర‌మే చేసి నిరాశ ప‌ర్చాడు. ఇప్ప‌టి దాకా కోహ్లీ 15 ఏళ్ల పాటు ఆడాడు. ఎన్నో విజ‌యాల‌లో భాగం పంచుకున్నాడు. కాస్తంత రెస్ట్ అవ‌స‌రం అని పేర్కొన్నాడు.

Also Read : రాజ‌స్థాన్ రాజసం స‌మిష్టికి సంకేతం

Leave A Reply

Your Email Id will not be published!