Yuzvendra Chahal Kartik : దినేష్ కార్తీక్ కు షాక్ ఇచ్చిన చాహ‌ల్

క్యాచ్ వ‌దిలేసినా అద్భుత‌మైన ర‌నౌట్

Yuzvendra Chahal : రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్ లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. మొద‌ట‌గా బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 144 ర‌న్స్ చేసింది.

అనంత‌రం బ‌రిలోకి దిగిన బెంగ‌ళూరును 115 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసి ఆలౌట్ చేసింది. ఈ త‌రుణంలో కుల్దీప్ సేన్ 4 వికెట్లు తీశాడు. ర‌విచంద్ర‌న్ అశ్విన్ మూడు వికెట్ల ప‌డ‌గొట్టాడు. చాహ‌ల్ (Yuzvendra Chahal)క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు.

ప‌రుగులు త‌క్కువ‌గా ఇచ్చాడు. కానీ వికెట్ తీయ‌లేదు. ఇదే స‌మ‌యంలో టోర్నీలో అత్య‌ధికంగా వికెట్లు తీసిన బౌల‌ర్ గా నిలిచాడు. ప‌ర్పుల్ క్యాప్ లో టాప్ లో ఉన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 18 వికెట్లు తీశాడు.

ఈ సంద‌ర్భంగా త‌ను చేసిన బౌలింగ్ లో స్టార్ ప్లేయ‌ర్ దినేశ్ కార్తీక్ బంతిని అందుకోబోయి జార విడిచాడు. కానీ ఆ త‌ర్వాతి బంతికి అద్భుతంగా క‌ళ్లు చెదిరేలా కార్తీక్ ను ర‌నౌట్ చేశాడు.

దీంతో ఒక్క‌సారిగా మ్యాచ్ పూర్తిగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చేతిలోకి వెళ్లి పోయంది. కేవ‌లం దినేష్ కార్తీక్ 4 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్నాడు. కేవ‌లం ఆరు ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.

దీంతో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 29 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలై పోయింది. ఇదిలా ఉండ‌గా ఐపీఎల్ లో దినేష్ కార్తీక్ అద్భుత‌మైన ఫామ్ లో ఉన్నాడు. 9 మ్యాచ్ ల‌లో 216 ర‌న్స్ చేశాడు.

ఇదే ఐపీఎల్ టోర్నీలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో దినేష్ కార్తీక్ ఓడి పోయే బెంగ‌ళూరు మ్యాచ్ ను గెలిపించాడు. కానీ ఈసారి వ‌ర్క‌వుట్ కాలేదు.

Also Read : చుక్క‌లు చూపించిన కుల్దీప్ సేన్

Leave A Reply

Your Email Id will not be published!