Mohammad Kaif : భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్ (Mohammad Kaif )ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న వెటరన్ స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ పై ప్రశంసలు కురిపించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా ఆడాడు. 88 రన్స్ చేశాడు. ఎక్కడా తగ్గలేదు. అతడితో పాటు అంబటి రాయుడు కూడా బాగానే ఆడినా శిఖర్ ధావన్ కే ఎక్కువగా చాన్స్ ఉందన్నాడు కైఫ్.
ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఇప్పటికే భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ కసరత్తు ప్రారంభించింది. ఐపీఎల్ ను వేదికగా అబ్జర్వ్ చేస్తోంది. ఈ తరుణంలో మహ్మద్ కైఫ్ (Mohammad Kaif )తన ప్రయారిటీ మాత్రం ధావన్ కే ఇస్తానని స్పష్టం చేశాడు.
ఎందుకంటే ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం శిఖర్ కు ఉందన్నాడు. ఇది భారత జట్టుకు ఎంతో మేలు చేకూర్చుతుందని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ ఈ ఐపీఎల్ లో నాలుగో విజయాన్ని నమోదు చేసింది.
మరో వైపు రాజస్తాన్ రాయల్స్ , గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగలూర్ , రైజర్స్ హైదరాబాద్ తో పాటు పంజాబ్ ప్లే ఆఫ్స్ కోసం పోటీ పడుతున్నాయి.
ఇప్పటి వరకు ఐపీఎల్ లో 6,000 పరుగులు పూర్తి చేశాడు శిఖర్ ధావన్. మొత్తంగా మహ్మద్ కైఫ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో మరింత ఆసక్తిని రేపుతున్నాయి.
ధావన్ తో పాటు సంజూ శాంసన్ కూడా పోటీలో ఉన్నాడు. మరి ఎవరిని ఎంపిక చేస్తారనేది ఉత్కంఠ నెలకొంది.
Also Read : దినేష్ కార్తీక్ కు షాక్ ఇచ్చిన చాహల్