Rashid Khan : ఐపీఎల్ లో నువ్వా నేనా అన్న రీతిలో చివరి దాకా సాగింది సన్ రైజర్స్ హైదరాబాద్ , గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్. మొదటగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 194 రన్స్ చేసింది.
ఈ తరుణంలో 195 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ చివరి దాకా పోరాడింది. వృద్ధి మాన్ సాహా, రాహుల్ తెవాటియా అద్భుతంగా రాణించారు. కానీ ఆఫ్గనిస్తాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్(Rashid Khan )దుమ్ము రేపాడు.
ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పూనకం వచ్చినట్లుగా దంచి కొట్టాడు. కేవలం 11 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు రషీద్ ఖాన్ . ఇందులు 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. మొత్తం 31 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఒకానొక దశలో గుజరాత్ గెలవదని డిసైడ్ అయ్యారు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశలపై నీళ్లు చల్లాడు రషీద్ ఖాన్(Rashid Khan ). గత కొన్నేళ్లు హైదరాబాద్ జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన రషీద్ ఖాన్ 2022 ఐపీఎల్ లో కొత్తగా ఎంటరైన గుజరాత్ టైటాన్స్ కు వెళ్లాడు.
భారీ ధరకు చేజిక్కించుకుంది ఖాన్ ను. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటర్ గా రషీద్ ఖాన్ తనదైన సత్తా చాటాడు. కానీ ఈసారి బౌలింగ్ పరంగా అంతగా ప్రభావం చూపక పోయినా హైదరాబాద్ తో మ్యాచ్ లో మాత్రం పూర్తిగా అతడు రెచ్చి పోయాడు.
రషీద్ ఖాన్ ఆడడం వల్లే గెలవదని అనుకున్న గుజరాత్ టైటాన్స్ గెలిచింది. మొత్తంగా హైదరాబాద్ ఆశలపై నీళ్లు చల్లాడు.
Also Read : శిఖర్ ధావన్ పై కైఫ్ కామెంట్స్