Siddaramaiah : అజ‌య్ దేవ‌గ‌న్ బీజేపీ మౌత్ పీస్

నిప్పులు చెరిగిన సిద్ద‌రామ‌య్య

Siddaramaiah : హిందీ జాతీయ భాష అంటూ పేర్కొన్న బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌న్ పై క‌న్న‌డిగులు నిప్పులు చెరుగుతున్నారు. ఇప్ప‌టికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా దేశ వ్యాప్తంగా హిందీ మాట్లాడాల‌ని సూచించారు.

అంతే కాదు అవ‌స‌ర‌మైతే త‌ప్ప ఇంగ్లీష్ మాట్లాడరాద‌ని ప్ర‌తి ఒక్క‌రు హిందీని త‌ప్ప‌నిస‌రిగా ఉప‌యోగించాల‌ని స్ప‌ష్టం చేశారు. దీనిపై నిప్పులు చెరిగారు త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్.

హిందీ భాష పేరుతో త‌మ‌పై పెత్త‌నం చెలాయించాల‌ని చూస్తే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. డీఎంకేతో పాటు అన్నాడీఎంకే సైతం మండిప‌డింది.

విచిత్రం ఏమిటంటే త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ అన్నామ‌లై సైతం ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. తాము ఒప్పుకోబోమ‌న్నారు. ఈ త‌రుణంలో క‌న్న‌డ నాట సినీ రంగానికి చెందిన వారితో పాటు రాజ‌కీయ పార్టీలు సైతం భగ్గుమ‌న్నాయి.

తాము ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. హిందీ భాష కంటే క‌న్న‌డ అత్యంత ప్రాచీన‌మైన భాష అని పేర్కొన్నారు. ఇందుకు త‌మ వ‌ద్ద సాక్ష్యాలు ఉన్నాయ‌ని తెలిపారు.

ఈ త‌రుణంలో అగ్నికి ఆజ్యం పోసిన‌ట్లుగా అజ‌య్ దేవ‌గ‌న్ హిందీ మ‌న మాతృ భాష‌, ఇది జాతీయ భాష అంటూ చెప్ప‌డంపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది.

నీ ప‌నేదో నువ్వు చేసుకోక భాష గురించి నీకెందుకు అంటూ ఫైర్ అయ్యారు మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య‌(Siddaramaiah). ఇంకోసారి హిందీ అని అంటే నీకు మూడిన‌ట్టేన‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

హిందీతో పాటు ఇత‌ర భాష‌ల‌ను గౌర‌వించ‌డం మ‌న సంస్కృతి అన్న సంగ‌తి మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు.

Also Read : ‘రన్‌వే 34’ అదిరింద‌న్న అమితాబ్‌

Leave A Reply

Your Email Id will not be published!