Yuvraj Singh : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh)సంచలన కామెంట్స్ చేశాడు. టీమిండియా టెస్టు జట్టుకు నాయకత్వం వహించేందుకు సరైన ఆటగాడు రిషబ్ పంత్ అని పేర్కొన్నాడు.
అద్భుతమైన ప్రతిభా పాటవాలు కలిగి ఉన్నాడని కితాబు ఇచ్చాడు. భవిష్యత్తులో ఎవరు స్కిప్పర్ కరెక్ట్ ప్లేయర్ అన్న ప్రశ్నకు తడుము కోకుండా సమాధానం చెప్పాడు.
తన దృష్టిలో రిషబ్ పంత్ తప్ప ఇంకొకరు కనిపించడం లేదన్నాడు. రిషబ్ పంత్ కు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో దగ్గరి పోలికలు ఉన్నాయని వెల్లడించాడు.
ఇదిలా ఉండగా గత ఏడాది భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. అతడి ప్లేస్ లో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ రోహిత్ శర్మకు అప్పగించింది.
ఇదే సమయంలో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కు చాన్స్ ఇచ్చింది. ఈ తరుణంలో ఫామ్ లేమితో వైస్ కెప్టెన్సీ పదవిని పోగొట్టుకున్నాడు అజింక్యా రహానే. ప్రస్తుతం యువరాజ్ సింగ్ (Yuvraj Singh)చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
భారత సెలెక్టర్లు రిషబ్ పంత్ కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని సూచించాడు. వికెట్ కీపర్ ఆలోచనాపరులుగా ఉంటారని, మైదానంలో ఎల్లప్పుడూ చురుకుగా ఉంటాడని అందుకే పంత్ రైట్ పర్సన్ అని పేర్కొన్నాడు.
ఇదే సమయంలో బీసీసీఐ రిషబ్ పంత్ కు కొంత కాలం అంటే ఓ ఆరు నెలలు లేదా ఓ ఏడాది సమయం ఇవ్వాలని అప్పుడు అద్భుతాలు చూస్తారని జోస్యం చెప్పాడు యువరాజ్ సింగ్.
టెస్టు జట్టుకు నాయకత్వం వహించే అరుదైన ఆటగాడు పంత్ అని కితాబు ఇచ్చాడు.
Also Read : రఫ్పాడించిన రాహుల్ తెవాటియా