Ram Gopal Varma : బాలీవుడ్ స్టార్స్ అభద్రతలో ఉన్నారు -ఆర్జీవి
రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్స్
Ram Gopal Varma : దిగ్గజ దర్శకుడు, నిర్మాత రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ఈసారి బాలీవుడ్ పై విరుచుకు పడ్డారు. హిందీ భాష జాతీయ భాష అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఇదే సమయంలో దక్షిణాదికి చెందిన టాలీవుడ్ , కోలీవుడ్ , శాండిల్ వుడ్ పరిశ్రమలకు చెందిన సినిమాలు ఇటీవల పాన్ ఇండియా మూవీస్ గా విడుదలయ్యాయి.
వాటిలో బీస్ట్ , పుష్ప, ఆర్ఆర్ఆర్ తో పాటు ప్రశాంత్ నీల్ తీసిన కేజీఎఫ్ -2 చిత్రాలు బాక్సులు బద్దలు కొట్టాయి. సుకుమార్ తీసిన పుష్ప ఆల్ టైం రూ. 360 కోట్లకు పైగా కొల్లగొట్టింది.
ఇదే సమయంలో జక్కన్న తీసిన ఆర్ఆర్ఆర్ రూ. 1000 కోట్లను దాటేసింది. తాజాగా కేజీఎఫ్ కు సీక్వెల్ గా తీసిన కేజీఎఫ్ -2 మూవీ అదరగొడుతోంది. బాలీవుడ్ ను షేక్ చేసింది.
హాలీవుడ్ లో సైతం చర్చకు దారి తీసింది. ఆ మూవీ ఇప్పటికే రూ. 1000 కోట్ల మార్క్ ను దాటేసిందని సినీ వర్గాల బోగట్టా. ఈ తరుణంలో అజయ్ దేవగన్ కన్నడ మూవీపై కామెంట్ చేయడం కలకల రేపింది.
హిందీ భాషే గొప్పదన్నట్లు పేర్కొనడం దీనిని కర్ణాటక మాజీ సీఎంలు సిద్దరామయ్య, కుమార స్వామి తీవ్రంగా ఖండించారు. దేవగనన్ ను భారతీయ జనతా పార్టీకి మౌత్ పీస్ అంటూ ఆరోపించారు.
ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma )స్పందించారు. సౌత్ ఇండియాకు చెందిన సినిమాలు ఊహించని రీతిలో సక్సెస్ కావడంతో బాలీవుడ్ కు చెందిన సినీ స్టార్స్ తట్టుకోలేక పోతున్నారని, పూర్తి అభద్రత (ఇన్ సెక్యూరిటీ )కు లోనవుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ కలకలం రేగుతోంది.
Also Read : ‘సుదీప్..అజయ్ దేవగన్’ డైలాగ్ వార్