Sanju Samson : భారత క్రికెట్ స్టార్ హిట్టర్ గా పేరొందిన కేరళ కు చెందిన సంజూ శాంసన్(Sanju Samson) పై ప్రశంసలు కురుస్తున్నాయి. గత ఐపీఎల్ సీజన్ లో ఊహించని రీతిలో స్టీవ్ స్మిత్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం సంజూ శాంసన్ కు పగ్గాలు అప్పగించింది.
2021లో జరిగిన ఐపీఎల్ లో అత్యధిక పరుగుల జాబితాలో శాంసన్ నిలిచాడు. తాజాగా ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ 15వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కు నాయకత్వం వహిస్తూ మంచి మార్కులు కొట్టేశాడు.
ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ లలో రాజస్థాన్ 6 మ్యాచ్ లలో విజయం సాధించింది. రెండింట్లో ఓడి పోయింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.
జట్టును విజయ పథంలో నడిపించడంలో సంజూ శాంసన్ సక్సెస్ అయ్యాడని కితాబు ఇచ్చాడు కేరళకు చెందిన స్టార్ ఆటగాడు సచిన్ బేబీ. గొప్ప ఇన్నింగ్స్ లు ఆడక పోయినా అవసరమైన సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడంటూ పేర్కొన్నాడు.
సంజూ శాంసన్ అద్భుతంగా రాణిస్తున్నాడని నాయకత్వం పరంగా తెలిపాడు. ఐపీఎల్ లాంటి మెగా టోర్నీలో నాయకుడిగా సక్సెస్ కావడం మామూలు విషయం కాదన్నాడు.
గెలుపు సాధిస్తే ప్రశంసించే వాళ్లు ఎందరో ఉంటారని కానీ అదే మ్యాచ్ ఓడి పోతే మాత్రం తిట్టేందుకు వేలల్లో ఉంటారని పేర్కొన్నాడు సచిన్ బేబీ. కెప్టెన్ గా చాలా వత్తిళ్లు ఉంటాయి.
దానిని నిర్వహించడం మామూలు విషయం కాదన్నాడు. ఐపీఎల్ లో నాయకత్వం వహించడం కేరళకు శుభ పరిణామమని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Also Read : నా టార్గెట్ ఇంకా పూర్తి కాలేదు