DC vs KKR : ఐపీఎల్ 2022లో భాగంగా ముంబై వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ కొనసాగింది. ఢిల్లీ క్యాపిటల్స్(DC vs KKR) స్కిప్పర్ రిషబ్ పంత్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
దీంతో కోల్ కతా నైట్ రైడర్స్(DC vs KKR) నానా కష్టాలు పడి 147 రన్స్ టార్గెట్ గా ముందుంచింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన
ఢిల్లీ క్యాపిటల్స్ సైతం చివరి వరకు పోరాడింది. ఆఖరున రోవ్ మన్ పావెల్ అద్భుతంగా ఆడడంతో ఆ మాత్రం గట్టెక్క గలిగింది.
33 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
4 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఇన్నింగ్స్ మొదట్లోనే ఆసిస్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ మరోసారి రాణించాడు.
42 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. లలిత్ యాదవ్ 22 రన్స్ చేస్తే అక్షర్ పటేల్ 27 పరుగులు చేశారు.
ఇక కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో ఉమేష్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
4 ఓవర్లు వేసిన యాదవ్ 24 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు.దీంతో చివరి దాకా గెలుస్తుందా లేదా అన్న ఆందోళన నెలకొంది. ఉమేష్ తో పాటు హర్షిత్ రాణా, సరైన్ చెరో వికెట్ తీశారు.
ఇక టాస్ ఓడి బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స కు కుల్దీప యాదవ్ చుక్కలు చూపించాడు. కేవలం 14 పరుగులు మాత్రమే ఇచచి 4 వికెట్లు తీశాడు. దీంతో ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేసింది.
నితీశ్ రాణా చెలరేగి ఆడాడు. 33 బాల్స్ ఎదుర్కొని 4 సిక్సర్లు, 3 ఫోర్లు కొట్టాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 42 రన్స్ చేశాడు. ఇక ఆఖరులో వచ్చిన ముస్తాఫిజుర్ 18 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.
Also Read : సంజూ శాంసన్ కెప్టెన్సీ సూపర్