Kuldeep Yadav : స్పిన్ మాయాజాలం ఎలా ఉంటుందో ఆచరణలో చేసి చూపించాడు కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav). ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న కుల్దీప్ కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో బంతులతో మ్యాజిక్ చేశాడు.
దీంతో బ్యాటర్లు అద్భుతమైన బాల్స్ కు వికెట్లు సమర్పించుకున్నారు. కేవలం 4 ఓవర్లు మాత్రమే వేసిన కుల్దీప్ యాదవ్ 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 4 కీలకమైన వికెట్లు తీశాడు. కోల్ కతా నడ్డి విరిచాడు.
ఈ సమయంలో రాణా ఆడక పోయి ఉండి ఉంటే ఆ మాత్రం స్కోర్ కూడా చేసి ఉండేది కాదు. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది.
ఇక కుల్దీప్ యాదవ్ విషయానికి వస్తే మనోడిది కాన్పూర్. కుల్దీప్ (Kuldeep Yadav)ను ఎదుర్కొని నిలిచిన వారిలో రాణాతో పాటు అయ్యర్ కూడా ఉన్నారు. ఇక కుల్దీప్ యాదవ్ వయసు 27 ఏళ్లు. 14 డిసెంబర్ 1994లో పుట్టాడు.
యూపీ మనోడిది. ఎడమ చేతి మణికట్టు మాంత్రికుడు. 2017 మార్చి 25న ఆస్ట్రేలియాతో టెస్టు అరంగేట్రం చేశాడు. 2021 ఇంగ్లండ్ తో చివరి టెస్టు ఆడాడు. 2017 జూన్ 23న వెస్టిండీస్ తో వన్డే మ్యాచ్ స్టార్ట్ చేశాడు.
ఈ ఏడాది చివరి వన్డే ఆడాడు. టీ20 మ్యాచ ను 2017 జూలై 9న విండీస్ తో అరంగేట్రం చేశాడు. చివరి టీ20 2022 ఫిబ్రవరిలో శ్రీలంకతో ఆడాడు కుల్దీప్ యాదవ్. 2012లో ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు.
2014 నుంచి 2021 దాకా కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు.
Also Read : ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ గా బెన్ స్టోక్స్