Umran Malik : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ 2022లో ఒకే ఒక్కడు హాట్ టాపిక్ గా మారాడు. అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. అంతే కాదు మోస్ట్ డేంజరస్ బౌలర్ గా పేరొందిన ఆ క్రికటర్ ఎవరో కాదు సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న జమ్మూ కాశ్మీర్ డైనమిక్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్.
గంటకు ఇప్పటి వరకు 153 కిలోమీటర్ల స్పీడ్ తో బంతుల్ని విసురుతున్నాడు. అంతే కాదు గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో తన బౌలింగ్ తో చుక్కలు చూపించాడు. 4 ఓవర్లు వేసి ఏకంగా 5 వికెట్లు తీశాడు.
అందులో క్లీన్ బౌల్డ్ లు ఉండడం విశేషం. మనోడి స్పీడ్ కు బ్యాటర్లు బెంబేలెత్తి పోతున్నారు. కనీసం డిఫెన్స్ ఆడేందుకు సైతం ఇబ్బంది పడుతున్నారు.
మరో వైపు అతడి ఆట తీరుకు తాజా, మాజీ క్రికెటర్లే కాదు రాజకీయ నాయకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. వారిలో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కితాబు ఇచ్చారు.
అతడిని జాతీయ జట్టులోకి తీసుకోవాలని, మంచి కోచ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ తరుణంలో గుజరాత్ తో హైదరాబాద్ ఓడి పోయినా అద్బుత బౌలింగ్ తో మెస్మరైజ్ చేసిన ఉమ్రాన్ మాలిక్ (Umran Malik)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. తన టార్గెట్ ఇంకా ఉందని అది పూర్తి కాలేదన్నాడు. గంటకు 155 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయాలన్నదే తన కల అని చెప్పాడు ఉమ్రాన్ మాలిక్.
Also Read : భారత్ కు కాబోయే కెప్టెన్ పంత్