Manoj Bajpayee : ఒకప్పుడు హిందీ మూవీలు డామినేట్ చేశాయి. వాటిని ఇతర భాషలలో డబ్ చేయడమో రీమేక్ చేయడమో జరిగేది. కానీ ఇటీవలి కాలంలో ట్రెండ్ మారింది. సౌత్ ఇండియా సినిమాలు దుమ్ము రేపుతున్నాయి.
సుకుమార్ తీసీన పుష్ప, జక్కన్న తీసిన ఆర్ఆర్ఆర్, ప్రశాంత్ నీల్ తీసిన కేజీఎఫ్ -2 దెబ్బకు బాలీవుడ్ షేక్ అవుతోంది. ఒక మూవీ రూ. 360 కోట్లకు పైగా వసూలు చేస్తే మరొకటి రూ. 1000 కోట్లను దాటేసింది.
ఇక కేజీఎఫ్ -2 అయితే బాలీవుడ్ ను షేక్ చేసింది. రాఖీ భాయ్ యశ్ దెబ్బకు ఠారెత్తింది సినీ ఇండస్ట్రీ. తాజాగా విలక్షణ నటుడిగా పేరొందిన మనోజ్ బాజ్ పేయి(Manoj Bajpayee )సంచలన కామెంట్స్ చేశాడు.
సౌత్ ఇండియా సినిమాలంటే జంకుతున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకప్పుడు ప్రాంతీయ సినిమాలంటే చులకనగా చూసిన నటీ నటులు ఇప్పుడు వాటిపై ఆసక్తి కనబరుస్తున్నారు
. ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అనిల్ కపూర్ బాగున్నాయంటూ కితాబు ఇచ్చారు. ఆ మూడు సినిమాలు బాలీవుడ్ ను కోలుకోలేని రీతిలో వసూళ్లలో దెబ్బ కొట్టాయంటూ కామెంట్ చేసి మరింత కలకలం రేపాడు వివాదాస్పద దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మ.
ఆయన వరుసగా ట్వీట్ల వర్షం కురిపించాడు. సౌత్ ఇండియా మూవీస్ నుంచి నేర్చుకుంటే బెటర్ అన్నాడు అనిల్ కపూర్. తాజాగా మనోజ్ వాజ్ పేయి(Manoj Bajpayee )నిర్మాతలపై కామెంట్ చేశాడు.
దక్షిణాది సినిమాలతో నిర్మాతలు బెంబేలెత్తి పోతున్నారని అన్నాడు. తాజాగా మనోజ్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : సుమ లేకపోతే జయమ్మ పంచాయితీ లేదు