Ian Bishop : ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు. రోజు రోజుకు ఆటపై ఫోకస్ పెట్టలేక పోతున్నాడు. కోహ్లీ ఆటను చూసిన వాళ్లంతా ఇతనేనా ఆడుతున్నది అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ 2022లో పేలవమైన ప్రదర్శన చేస్తుండడం, పరుగులు తీసేందుకు నానా తంటాలు పడడంతో ఫామ్ పై పలు విమర్శలు తలెత్తాయి. మొన్న హాఫ్ సెంచరీ చేశాడు.
రెండు సార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 30 రన్స్ చేశాడు మొయిన్ ఆలీ బౌలింగ్ లో ఆడలేక పెవిలియన్ దారి పట్టాడు. మునుపటి కసి, జోష్ విరాట్ కోహ్లీలో కనిపించడం లేదు.
గత రెండు సంవత్సరాలుగా మనోడు సెంచరీ కొట్టిన దాఖలాలు లేవు. పూర్తిగా పట్టు కోల్పోయినట్లు అనిపిస్తోంది. ఈ తరుణంలో ఇయాన్ బిషప్ సంచలన కామెంట్స్ చేశాడు. విరాట్ కోహ్లీని చూసినప్పుడు, అతడు ఆడుతుంటే తనకు జాలేస్తోందంటూ వ్యాఖ్యానించాడు.
వికెట్లను పారేసు కోవడంత కోహ్లీకి అలవాటుగా మారిందన్నాడు. విచిత్రం ఏమిటంటే ఇప్పటి వరకు 11 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో కేవలం కోహ్లీ చేసింది 178 రన్స్ మాత్రమే.
ఈ సీజన్ లో అత్యంత తక్కువ స్కోర్ చేసిన ముగ్గురు ఆటగాళ్లలో మనోడు ఒకడు కావడం విశేషం. ఒకప్పుడు స్పిన్ బౌలింగ్ లో విరుచుకు పడేవాడు.
కానీ ఎందుకనో ఇప్పుడు ఆ స్పిన్నర్లకే తన వికెట్ ను పారేసుకుంటున్నాడని పేర్కొన్నాడు ఇయాన్ బిషప్(Ian Bishop ). బీసీసీఐ చీఫ్ కూడా హెచ్చరించడం గమనార్హం.
Also Read : మ్యాచ్ కీలకం ఢిల్లీ గెలవక పోతే కష్టం