Nicholas Pooran : ఐపీఎల్ లో భాగంగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ సత్తా చాటింది. సన్ రైజర్స్ హైదరాబాద్ పై 21 పరుగుల తేడాతో గెలుపొందింది. 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 207 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
అనంతరం ఛేదనలో మైదానంలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ తడబాటుకు గురైంది. కానీ ఆ జట్టులో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. శివమెత్తినట్టు ఆడాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. తనతో పాటు ఇంకొకరు తోడుగా ఉండి ఉంటే సీన్ వేరుగా ఉండేది. ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచి ఉండక పోయేది కాదు.
8 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేసి చాప చుట్టేసింది. ఇక నికోలస్ పూరన్(Nicholas Pooran )విషయానికి వస్తే మొత్తం 34 బంతులు ఎదుర్కొన్నాడు. ఇందులో 2 ఫోర్లు 6 భారీ సిక్సర్లు ఉన్నాయి.
అతడు చేసిన పరుగుల్లో ఫోర్లు, సిక్సర్ల ద్వారా 48 రన్స్ వచ్చాయి. కానీ ఇంతగా మెరుపులు మెరిపించినా తన జట్టును గెలిపించ లేక పోయాడు. కానీ క్రీడాభిమానుల మనసు దోచుకున్నాడు నికోలస్ పూరన్.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ప్రారంభం లోనే కీలక వికెట్లను కోల్పోయింది సన్ రైజర్స్ హైదరాబాద్. టాప్ ఆర్డర్ బ్యాటర్స్ అభిషేక్ శర్మ 7 పరుగులు , కెప్టెన్ విలియమ్సన్ 4 పరుగులకే వెనుదిరిగారు.
ఈ తరుణంలో రాహుల్ త్రిపాఠి 22 రన్స్ చేసి పర్వాలేదనిపించాడు. మార్క్ రమ్ 25 బంతులు ఆడి 4 ఫోర్లు 3 సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. 42 రన్స్ చేశాడు. ఖలీల్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్ హైదరాబాద్ బ్యాటర్లకు కళ్లెం వేశారు.
Also Read : ఢిల్లీ సెన్సేషన్ హైదరాబాద్ పరేషాన్