Aiden Markram : ఐపీఎల్ కీలక మ్యాచ్ లో 208 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ చివరి దాకా పోరాడింది. 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేసి 21 పరుగుల తేడాతో ఓటమి మూటగట్టుకుంది.
కెప్టెన్ తో పాటు ఇతర ఆటగాళ్లు విఫలమైనా నికోలస్ పూరన్ శివ మెత్తి ఆడాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడే ఎయిడెన్ మార్క్ రమ్(Aiden Markram ). కేవలం 25 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఎయిడెన్ 4 ఫోర్లు 3 సిక్సర్లు బాదాడు. 42 రన్స్ చేశాడు.
ఒకవేళ పూరన్ లేదా మార్క్ రమ్(Aiden Markram )గనుక ఉండి ఉంటే సీన్ వేరేగా ఉండేది ఢిల్లీ కచ్చితంగా ఓడి పోయేది. కానీ ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. ముఖ్యంగా ఖలీల్ అహ్మద్ 3 కీలక వికెట్లు తీశాడు.
హైదరాబాద్ ను కోలుకో లేకుండా చేశాడు. పూరన్ 34 బంతులు ఎదుర్కొన్నాడు. ఇందులో 2 ఫోర్లు 6 భారీ సిక్సర్లు ఉన్నాయి. అతడు చేసిన పరుగుల్లో ఫోర్లు, సిక్సర్ల ద్వారా 48 రన్స్ వచ్చాయి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ప్రారంభం లోనే కీలక వికెట్లను కోల్పోయింది సన్ రైజర్స్ హైదరాబాద్. టాప్ ఆర్డర్ బ్యాటర్స్ అభిషేక్ శర్మ 7 పరుగులు , కెప్టెన్ విలియమ్సన్ 4 పరుగులకే వెనుదిరిగారు.
రాహుల్ త్రిపాఠి 22 రన్స్ చేసి నిరాశ పరిచాడు. ఒకవేళ క్రీజులో ఉండి ఉంటే బాగుండేది. కానీ జరగాల్సిన నష్టం జరిగి పోయింది. అనంతరం మార్క రమ్ ఆడినా ఫలితం లేక పోయింది. పరాజయం పాలైంది హైదరాబాద్.
Also Read : కోహ్లీ ఆట తీరుపై బిషప్ కామెంట్