RCB vs SRH IPL 2022 : తిప్పేసిన హసరంగ ఆర్సీబీ విక్టరీ
67 పరుగులతో ఘన విజయం
RCB vs SRH IPL 2022 : ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ కు మరింత పోటీ పెరిగింది. రాయల్ ఛాలెంజర్స బెంగళూరు సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 193 రన్స్ చేసింది(RCB vs SRH). అనంతరం టార్గెట్ ఛేదనలో మైదానంలోకి వచ్చిన సన్ రైజర్స్ ఎలాంటి ప్రతిఘటన లేకుండానే చాప చుట్టేసింది.
ప్రధానంగా ఆర్సీబీ బౌలర్ హసరంగ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లు వేసిన హసరంగా ఏకంగా 5 వికెట్లు తీసుకుని సన్ రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. దాంతో హైదరాబాద్ 19.2 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది(RCB vs SRH).
ఐపీఎల్ లో హసరంగ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేశాడు. కేవలం నాలుగు ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్లు తీశాడు.
ఇదిలా ఉండగా ఇదే ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ స్టార్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో మాలిక్ 4 ఓవర్లు వేసి 25 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు(RCB vs SRH). మొత్తంగా ఈ మ్యాచ ను ఒంటి చేత్తో గెలిపించాడు హసరంగా అని చెప్పక తప్పదు.
ఇక హైదరాబాద్ జట్టులో రాహుల్ త్రిపాఠి దుమ్ము రేపాడు. 58 రన్స్ చేసి సత్తా చాటాడు. ఇక మార్క్ రమ్ 21, పూరన్ 19 పరుగుగలు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో హేజిల్ వుడ్ 2 వికెట్లు తీస్తే మ్యాక్స్ వెల్ , హర్షల్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు(RCB vs SRH).
ఇక మ్యాచ్ తన బౌలింగ్ దెబ్బతో బోల్తా కొట్టించిన హసరంగకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Also Read : జితేశ్ శర్మపై వీరూ కామెంట్