Wanindu Hasaranga : తిప్పేస్తున్న వానిందు హసరంగ
4 ఓవర్లు 18 పరుగులు 5 వికెట్లు
Wanindu Hasaranga : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు శ్రీలంక స్టార్ బౌలర్ వానిందు హసరంగ(Wanindu Hasaranga).
ఇప్పటి దాకా జమ్మూ కాశ్మీర్ కు చెందిన సన్ రైజర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్రాన్ మాలిక్ పేరు మీద ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు హసరంగ.
గుజరాత్ టైటాన్స్ ఆడిన సందర్భంలో ఎస్ ఆర్ ఎస్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్రాన్ మాలిక్ 4 ఓవర్లు వేసి 25 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.
ఇప్పటి దాకా అతడి పేరు మీద ఉన్న రికార్డును వానిందు హసరంగ(Wanindu Hasaranga) ఇదే హైదరాబాద్ పై 4 ఓవర్లు వేసి కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 5 కీలక వికెట్లు తీసి హైదరాబాద్ పతనాన్ని శాసించాడు.
కళ్లు చెదిరే బంతులతో మెస్మరైజ్ చేశాడు హసరంగ. పూర్తి పేరు పిన్నడువాగే వనిందు హసరంగా డిసిల్వా. 29 జూలై 1997లో పుట్టాడు. వయసు 24 ఏళ్లు.
ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ లో కీలక బౌలర్ గా ఎదిగాడు. కుడి చేతి వాటం బ్యాటర్, బౌలర్. 2017 నుంచి శ్రీలంక తరపున ప్రాతినిధ్యం వహించాడు.
26 డిసెంబర్ 2020లో దక్షిణాఫ్రికాతో టెస్టు అరంగేట్రం చేశాడు. చివరి టెస్టు 21 ఏప్రిల్ 2021 బంగ్లాదేశ్ తో ఆడాడు హసరంగా. 2 జూలై 2017 లో జింబాబ్వే తో వన్డే ఎంటర్ అయ్యాడు.
ఇక టీ20 లో 2 సెప్టెంబర్ 2019 లో న్యూజిలాండ్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. 2017లో సిల్హెట్ తరపున, 2020 నుంచి శ్రీలంకలో జాఫ్నా కింగ్స్ తరపున ఆడుతున్నాడు.
ఇక ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో 2021లో ఎంట్రీ ఇచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు ప్రాతినిధ్యం వహించాడు. బంతుల్ని తిప్పడంలో వికెట్లు తీయడంలో కీలకంగా వ్యవహరించాడు.
Also Read : సత్తా చాటిన రుతురాజ్ గైక్వాడ్