IPL 2022 Playoffs : ఉత్కంఠగా మారిన ప్లే ఆఫ్స్
ఇప్పటికే చేరుకున్న రెండు జట్లు
IPL 2022 Playoffs : ముంబై వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ 74 మ్యాచ్ లకు గాను ఇప్పటి వరకు 59 మ్యాచ్ లు పూర్తయ్యాయి.
14వ సీజన్ వరకు 8 జట్లు పాల్గొన్నాయి. ఈసారి కొత్తగా 2 జట్లు చేరాయి(IPL 2022 Playoffs). దీంతో 10 జట్లు పాల్గొంటున్నాయి. ప్లే ఆఫ్స్ కు లక్నో సూపర్ జెయంట్స్ , గుజరాత్ టైటాన్స్ చేరుకున్నాయి.
రాజస్థాన్ రాయల్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ , పంజాబ్ కింగ్స్ , చెన్నై సూపర్ కింగ్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ , ముంబై ఇండియన్స్ పాల్గొంటున్నాయి.
లక్నో సూపర్ కింగ్స్ ఇప్పటి దాకా 11 మ్యాచ్ లు ఆడింది. 8 సార్లు గెలుపొందగా 3 మ్యాచ్ లు ఓడి పోయింది. గుజరాత్ టైటాన్స్ 11 మ్యాచ్ లు ఆడి 8 మ్యాచ్ లు విజయం సాధించి 3 మ్యాచ్ లు పరాజయం పాలైంది.
రాజస్థాన్ రాయల్స్ 11 మ్యాచ్ లు(IPL 2022 Playoffs) ఆడింది. 7 మ్యాచ్ లలో గెలుపొందగా 4 మ్యాచ్ లలో ఓటమి పొందింది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి దాకా 12 మ్యాచ్ లు ఆడింది.
7 మ్యాచ్ లలో విక్టరీ సాధించగా 5 మ్యాచ్ లలో ఓటమి పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్ లు ఆడగా ఇందులో 5 మ్యాచ్ లలో విజయం సాధించి 6 మ్యాచ్ లలో పరాజయం పొందింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ 11 మ్యాచ్ లు ఆడగా ఇందులో 5 మ్యాచ్ లలో గెలుపొంది 6 మ్యాచ్ లలో ఓటమి పాలైంది.
పంజాబ్ కింగ్స్ సైతం 11 మ్యాచ్ లు ఆడగా ఇందులో 5 మ్యాచ్ లు విజయం సాధించి 6 మ్యాచ్ లలో పరాజయం పొందింది.
చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్ లు ఆడి 4 మ్యాచ్ లు గగెలుపొంది 7 మ్యాచ్ లలో ఓడింది(IPL 2022 Playoffs).. కోల్ కతా నైట్ రైడర్స్ 11 మ్యాచ్ లు ఆడి 4 మ్యాచ్ లు గెలు పొంది 7 మ్యాచ్ లలో ఓడి పోయింది.
ముంబై ఇండియ్స్ 10 మ్యాచ్ లు ఆడింది. 2 మ్యాచ్ లలో విజయం సాధించి 8 మ్యాచ్ లలో ఓటమి పాలైంది.
రాజస్థాన్ రాయల్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మిగతా రెండింటి కోసం పోటీ పడుతున్నాయి.
ఆయా జట్లకు సంబంధించి ఇంకా మ్యాచ్ లలో గెలుపొందితే తప్ప చెప్పలేని పరిస్థితి నెలకొంది.
Also Read : ముంబై వర్సెస్ కోల్ కతా బిగ్ ఫైట్