Rupee Weakens : బలహీన పడిన రూపాయి
డాలర్ కు రూ. 77.40
Rupee Weakens : భారతీయ రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరింది. డాలర్ కు రూ. 77.40 వద్ద ట్రేడ్ అవుతోంది. సోమవారం ప్రారంభంలో రూపాయి (Rupee Weakens )ఆల్ టైమ్ బలహీన పడింది.
పెట్టుబడిదారుల ప్రాధాన్యత కారణంగా రూపాయి వాల్యూ మరింత తగ్గింది. చైనాలో లాక్ డౌన్ లు, యూరప్ లో యుద్దం, అధిక వడ్డీ రేట్ల భయం కారణంగా భద్రత కోసం ఇన్వెస్టర్ల ప్రాధాన్యత కారణంగా రూపాయి తాజాగా ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి (Rupee Weakens )పడి పోయింది.
భారతీయ కరెన్సీ మార్చిలో దాని ఆల్ టైమ్ కనిష్ట స్థాయి వద్ద 77.05 కంటే ఎక్కువగా ట్రేడ్ అయ్యింది. ఇవాళ మరింత బలహీన పడంది భారతీయ రూపాయి. సేఫ్టీ ట్రేడ్ లు డాలర్ బలాన్ని మరింతగా పెంచాయి.
ఇది ద్రవ్యోల్బణం, అధికంగా ప్రపంచ వడ్డీ రేట్లకు దారి తీసింది. దీని వల్ల ఆర్థిక మాంద్యంకు దారి తీసే ప్రమాదం పొంచి ఉంది.
ఇదిలా ఉండగా ఫెడరల్ రిజర్వ్ తన బెంచ్ మార్క్ ఫండ్స్ రేటును 50 బేసిస్ పాయింట్లు , బలమైన ఉద్యోగాల డేటాను పెరగడం, రెండు దశాబ్దాల గరిష్ట స్థాయికి చేరింది.
వరుసగా ఐదవ వారం లాభ పడింది. రేట్ మార్కెట్ ఫ్యూచర్స్ జూన్ లో 75 బేసిస్ పాయింట్ లిఫ్ట్ ఆఫ్ కాగా ఈ ఏడాది మరో 200 బేసిస్ పాయింట్ల పెంపుదలకు మరో 75 శాతం పెరిగే చాన్స్ ఉంది.
మేలో మొదటి నాలుగు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ మార్కెట్ నుంచి రూ. 6, 400 కోట్లకు ఉపసంహరించు కోవడంతో రూపాయి బలహీన పడడానికి కారణమైంది.
Also Read : డబ్బుతో ప్రేమను కాలాన్ని కొనలేం