MI vs CSK IPL 2022 : పరువు కోసం ముంబై..చెన్నై పాకులాట
ప్లే ఆఫ్స్ ఆశలు ఇరు జట్లకు లేనట్లే
MI vs CSK IPL 2022 : ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ 5 సార్లు టైటిళ్లు గెలిచింది. నాలుగు సార్లు చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించి
సత్తా చాటింది. కానీ ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 మాత్రం ఇరు జట్లకు కలిసి రాలేదు.
పేలవమైన ఆట తీరుతో తీవ్ర నిరాశకు గురి చేశాయి. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి ఈ జట్లు. సీఎస్కే 11 మ్యాచ్ లు ఆడితే 4 మ్యాచ్ లలో విజయం సాధించింది. 7 గేమ్ లలో ఓటమి పాలైంది.
ఇక ముంబై ఇండియన్స్(MI vs CSK) 11 మ్యాచ్ లు ఆడితే 2 మ్యాచ్ లలో గెలుపొంది 9 మ్యాచ్ లలో పరాజయం పొందింది.
ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్ కు వెళ్లనట్లే. ఇరు జట్లు గెలవాలంటే ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే కనీసం 14 లేదా 16 పాయింట్లు కావాలి.
ప్రతి జట్టు 14 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ముంబైకి చాన్స్ లేదు. ఇక చెన్నై(MI vs CSK) ఆ మూడు గెలిచినా మొత్తం 10 పాయింట్లు మాత్రమే వస్తాయి.
ఏది ఏమైనా డిఫెండింగ్ చాంపియన్ల మధ్య కేవలం స్నేహ పూర్వక పోటీ మాత్రమే ఉంది.
చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ కు ధోనీ కెప్టెన్ కాగా రాబిన్ ఊతప్ప, రవీంద్ర జడేజా , డెవాన్ కాన్వే, క్రిస్ జోర్డాన్ , అంబటి రాయుడు ఉన్నారు.
వీరితో పాటు దీపక్ చాహర్ , డ్వేన్ బ్రావో, ప్రిటోరియస్ , ముకేశ్ చౌదరి, సేనాపతి, ఆసిఫ్ , సాన్ ట్నర్ , భగత్ వర్మ, నారాయణ్ జగదీశన్ ,
హంగేర్కర్ ఆడతారు. ఇక మొయిన్ అలీ, శివం దూబే, ఆడమ్ మిల్నే , హరి నిశాంత్ , మహీశ్ తీక్షణ, సోలంకి, సిమ్రన్ జిత్ సింగ్ , తుషార్ దేశ్ పాండే ఆడతారు.
ముంబై ఇండియన్స్(MI vs CSK) జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ కాగా , రమణ్ దీప్ సింగ్ , హృతిక్ షోకీన్ , రాహుల్ బుద్ది,
అర్షద్ ఖాన్, సూర్య కుమార్ యాదవ్,కీరన్ పొలార్డ్ , ఇషాన్ కిషన్ , జస్ ప్రీత్ బుమ్రా, బాసిల్ థంపి ఆడతారు. వీరితో పాటు ఆర్యన్ జుయల్ ,
అమూల్ ప్రీత్ సింగ్ , అర్జున్ టెండూల్కర్ , జోఫ్రా ఆర్చర్ , డానియెల్ సామ్స్ , టైమల్ మిల్స్ , డెవాల్డ్ బ్రెవిస్ ,
సంజయ్ యాదవ్ , తిలక్ వర్మ, మురుగన్ అశ్విన్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనాద్కత్ , మయాంక్ మార్కెండే , టిమ్ డేవిడ్ , రిలె మెరిడిత్ ఆడతారు.
Also Read : సంజూ శాంసన్ కు ఏమైంది