Liam Livingstone : లివింగ్ స్టోన్ జోర్దార్ ఇన్నింగ్స్
42 బంతులు 5 ఫోర్లు 4 సిక్సర్లు
Liam Livingstone : ఐపీఎల్ 2022లో మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు పంజాబ్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న లియామ్ లివింగ్ స్టోన్(Liam Livingstone). రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చుక్కలు చూపించాడు.
సహచర ఆటగాడు జాన్ బెయిర్ స్టో ఓ వైపు దుమ్ము రేపితే తానేమీ తక్కువ కాదంటూ రెచ్చి పోయాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించారు వీరిద్దరూ. బెయిర్ స్టో 29 బంతులు ఆడి 66 రన్స్ చేస్తే లివింగ్ స్టోన్ కేవలం 42 బంతులు ఆడి 70 రన్స చేశాడు.
ఇందులో 5 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. ఆర్సీబీ కెప్టెన్ డుప్లిసిస్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బరిలోకి దిగింది పంజాబ్ కింగ్స్. మైదానంలోకి రావడంతోనే ఓ వైపు శిఖర్ ధావన్ ఇంకో వైజు జాన్ బెయిర్ స్టో దంచి కొట్డడం స్టార్ట్ చేశారు.
ధావన్ 15 బంతులు ఆడి 21 పరుగులు చేసి అవుట్ కాగా ఆ తర్వాత బరిలోకి దిగిన లియామ్ లివింగ్ స్టోన్(Liam Livingstone) వచ్చీ రావడంతోనే దాడి చేయడం మొదలు పెట్టాడు.
బెంగలూరు బౌలర్లకు నిద్ర లేకుండా చేసిన జాన్ బెయిర్ స్టోన్ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు షాబాద్ అహ్మద్. బెయిర్ స్టో తర్వాత ఆ బాధ్యతను లివింగ్ స్టోన్ తీసుకున్నాడు.
పని పూర్తి చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు 209 పరుగుల భారీ టార్గెట్ ముందుంచింది.
లక్ష్య ఛేదనలో మైదానంలోకి వచ్చిన ఆర్సీబీ 155 పరుగులకే చాప చుట్టేసింది. ఒక్క గ్లెన్ మ్యాక్స్ వెల్ తప్ప ఇంకెవరూ ఆడలేక పోయారు.
Also Read : బెంగళూరుకు పంజాబ్ బిగ్ షాక్